Mon. Oct 7th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 25,2024: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ 2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.

వీటి ప్రకారం పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 160 శాతం పెరిగి రూ. 24,861 కోట్లకు చేరగా, నికర వడ్డీ మార్జన్ (ఎన్ఐఎం) 4.07 వృద్ధితో 5 బీపీఎస్ మేర పెరిగింది. కన్సాలిడేటెడ్ ఆర్‌వోఏ 1.84 శాతం, కన్సాలిడేటెడ్ ఆర్‌వోఈ 19.29 శాతం పెరిగాయి.

13 శాతం వృద్ధి చెందిన డిపాజిట్లు, 14 శాతం రుణ వృద్ధి వంటి అంశాలు ఇందుకు దోహదపడ్డాయి. నాలుగో త్రైమాసికంలో నిర్వహణ లాభం 15 శాతం వృద్ధి చెంది రూ. 10,536 కోట్లకు చేరింది. నికర లాభం త్రైమాసికాలవారీగా 17 శాతం వృద్ధి చెంది రూ. 7,130 కోట్లుగా నమోదైంది.

అంతక్రితం ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 5,728 కోట్ల నష్టం నమోదైంది. నికర వడ్డీ ఆదాయం 11 శాతం వృద్ధితో రూ. 13,089 కోట్లకు, నికర వడ్డీ మార్జిన్ 4.06 శాతానికి చేరింది.

బ్యాంకు బ్యాలెన్స్ షీటు వార్షికంగా 12% వృద్ధి చెంది 2024 మార్చి 31 నాటికి రూ. 14,77,209 కోట్లుగా ఉంది. మొత్తం డిపాజిట్లు 13 శాతం వృద్ధి చెందగా, వీటిలో సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లు 2 శాతం, కరెంటు అకౌంట్ డిపాజిట్లు 5% పెరిగాయి.

మొత్తం డిపాజిట్లలో కాసా డిపాజిట్లు 43 శాతంగా ఉన్నాయి. బ్యాంకు రుణాల వృద్ధి 14 శాతంగా, రూ. 9,65,068 కోట్లుగా ఉంది. నాలుగో త్రైమాసికంలో బ్యాంకు 12.4 లక్షల కొత్త క్రెడిట్ కార్డులు జారీ చేసింది. తద్వారా దేశీయంగా గత తొమ్మిది త్రైమాసికాల్లో అత్యధికంగా క్రెడిట్ కార్డులను జారీ చేసిన సంస్థల్లో ఒకటిగా నిల్చింది.

2023 డిసెంబర్ 31 నాటి గణాంకాలతో పోలిస్తే 2024 మార్చి 31 నాటికి బ్యాంకు స్థూల ఎన్‌పీఏలు 1.58 శాతం నుంచి 1.43 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.36 శాతం నుంచి 0.31 శాతానికి తగ్గాయి. పూర్తి సంవత్సరానికి రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై డైరెక్టర్ల బోర్డు రూ. 1 డివిడెండు సిఫార్సు చేసింది.

పూర్తి ఆర్థిక సంవత్సరంలో 475 శాఖలను జోడించడంతో దేశీయంగా 2,963 సెంటర్లలో మొత్తం శాఖలు, ఎక్స్‌టెన్షన్ కౌంటర్ల సంఖ్య 5,377కి చేరింది. ఏటీఎంలు, క్యాష్ రీసైక్లర్స్ సంఖ్య 16,026కి చేరింది.

ఆరు సెంటర్లలో యాక్సిస్ వర్చువల్ సెంటర్లు ఉండగా సుమారు 1,590 మంది వర్చువల్ రిలేషన్‌షిప్ మేనేజర్లు ఉన్నారు.

“ఈ ఆర్థిక సంవత్సరంలో యాక్సిస్ బ్యాంకు స్థిరంగా పురోగతి సాధించింది. ప్రాధాన్యతాంశాలైన భారత్ బ్యాంకింగ్, డిజిటల్, స్పర్శ్‌పై దృష్టి పెడుతూనే అందుబాటులోకి వచ్చిన కొత్త అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటున్నాం.

సిటీ వ్యాపార అనుసంధానం ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగుతోంది” అని యాక్సిస్ బ్యాంక్ ఎండీ&సీఈవో అమితాబ్ చౌదరి తెలిపారు.

ఇది కూడా చదవండి: వైఎస్ ఆర్సీపీ అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా ఆడారి కిషోర్ కుమార్..?

error: Content is protected !!