Mon. Jul 1st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 28,2024: క్రియాశీలకమైన,  స్థితిస్థాపకమైన సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి సంస్థల (ఎంఎస్ఎంఈ) పరిశ్రమకు గౌరవసూచకంగా, భారత్‌లోని ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్, అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా 350 పైచిలుకు ఎంఎస్ఎంఈ కస్టమర్లను సత్కరించింది. హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం తదితర నగరాల్లో నిర్దిష్ట యాక్సిస్ బ్యాంకు శాఖల్లో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.

తమ తమ రంగాల్లోను అలాగే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి గాను ఎంఎస్ఎంఈ కస్టమర్లు చేస్తున్న కృషికి గుర్తింపుగా, యాక్సిస్ బ్యాంక్ సీనియర్ ప్రతినిధులైన నూతి చక్రవర్తి (రీజనల్ బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్ – సౌత్ 2), ఎ. జగదీశ్వర్ రెడ్డి (నేషనల్ సేల్స్ మేనేజర్ – బిజినెస్ లోన్), హరనాథ్ మాడపాటి (సర్కిల్ హెడ్-హైదరాబాద్) ప్రశంసా పత్రాలను వారికి అందజేశారు. అలాగే, కొందరు ఎంఎస్ఎంఈ కస్టమర్లను వారి వ్యాపార ప్రాంగణాల్లో రిలేషన్‌షిప్ మేనేజర్లు సత్కరించారు.

ఈ సందర్భంగా ఎంఎస్ఎంఈల కోసం యాక్సిస్ బ్యాంకు పలు ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లను ప్రకటించింది. ఖర్చులను తగ్గించుకునేందుకు, నిధులను సులువుగాను, వేగవంతంగాను పొందేందుకు ఇవి తోడ్పడగలవు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, సెక్యూర్డ్ వర్కింగ్ క్యాపిటల్ ఉత్పత్తులపై ప్రాసెసింగ్ ఫీజులో 50% డిస్కౌంటుకు ప్రస్తుత ఎంఎస్ఎంఈ కస్టమర్లకు ప్రీ-క్వాలిఫైడ్ ఆఫర్లను బ్యాంకు ప్రకటించింది. అలాగే మెరుగైన వడ్డీ రేటు, తగ్గించిన ప్రాసెసింగ్ ఫీజుతో ఎంఎస్ఎంఈలకు ఈఎంఐ ఆధారిత అన్‌సెక్యూర్డ్ రుణాలను కూడా ఆఫర్ చేస్తోంది.

“భారత దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు, వాటికి తోడ్పాటును అందించేందుకు యాక్సిస్ బ్యాంక్ కట్టుబడి ఉంది. ఎంఎస్ఎంఈలు సమర్ధమంతంగా పనిచేసేలా వాటికి అధునాతన డిజిటల్ బ్యాంకింగ్ ఉత్పత్తులు, సర్వీసులను అందించడమనేది ఆర్థిక వృద్ధికి చోదకంగా ఉండగలదని మేము విశ్వసిస్తున్నాం.

మొక్కవోని స్ఫూర్తితో విజయాలు సాధిస్తున్న మా ఎంఎస్ఎంఈ కస్టమర్లు మాకెంతో గర్వకారణం” అని యాక్సిస్ బ్యాంక్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ (బ్రాంచ్ బ్యాంకింగ్) Ms. అర్నికా దీక్షిత్ తెలిపారు.

2024 మార్చి 31 నాటికి ఎంఎస్ఎంఈ రంగానికి రుణాల్లో యాక్సిస్ బ్యాంకుకు 8.4% మార్కెట్ వాటా ఉంది. యాక్సిస్ బ్యాంక్ ఎస్ఎంఈ రుణాలు వార్షికంగా 17%, త్రైమాసికాలవారీగా 5% వృద్ధిని కనపర్చాయి. తద్వారా మొత్తం రుణాల వృద్ధికి గణనీయంగా తోడ్పడ్డాయి.

Also read  :Axis Bank felicitates over 350 MSMEs in Telangana on International MSME Day

ఇదికూడా చదవండి: సమర్ధమంతమైన వరి సాగు కోసం ఏపీ, తెలంగాణ రైతులకు అధునాతన పడ్లింగ్ సొల్యూషన్స్‌తో సాధికారత కల్పిస్తున్న స్వరాజ్

Also read :Swaraj Empowers AP and Telangana Farmers with Advanced Puddling Solutions for Efficient Rice Cultivation

Also read :Alembic Pharmaceuticals announces USFDA Final Approval for Doxycycline Capsules, 40 mg

Also read :JIO INTRODUCES NEW UNLIMITED PLANS

Also read :PVR INOX Limited EXPANDS FOOTPRINT IN HYDERABAD WITH ALL 4K LASER CINEMA

Also read :OPPO’s Reno12 Series sets a new AI benchmark

ఇదికూడా చదవండి: ఈ ప్రభుత్వ పథకం ద్వారా 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఉచిత చికిత్స

ఇదికూడా చదవండి: ఇస్రో గూఢచర్యం కేసులో ఐదుగురిపై చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ