365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జూన్ 6,2024: భారత్‌లోని దిగ్గజ ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్, అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, సస్టెయినబిలిటీని ప్రోత్సహించే విషయంలో తమ నిబద్ధతను పునరుద్ఘాటించేలా పలు కార్యక్రమాలు నిర్వహించింది.
కమ్యూనిటీల్లో పర్యావరణంపై అవగాహన, బాధ్యతను పెంపొందించేలా ‘ఓపెన్ ఫర్ ది ప్లానెట్ క్లీనథాన్’(Open for the Planet Clean-A-Thon) చేపట్టింది. దేశవ్యాప్తంగా వివిధ పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించింది.
అలాగే రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు (ఆర్‌డబ్ల్యూఏ), మాల్స్, క్లబ్స్‌లో అవగాహన కార్యక్రమాలు, ఉద్యోగులు కూడా పాలుపంచుకునేలా పలు యాక్టివిటీలు నిర్వహించింది.
హైదరాబాద్, ముంబై, జైపూర్, పుణె, వారణాసి, న్యూఢిల్లీ, గువాహటి,బెంగళూరులో అత్యధికంగా పర్యాటకులు సందర్శించే 23 పర్యాటక ప్రదేశాల్లో 2024 జూన్ 5 నుంచి 12 వరకు వారం రోజుల పాటు పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నాయి.
చారిత్రక కట్టడాలు, ప్రసిద్ధ సైట్లను పరిరక్షించడం, పునరుద్ధరించడం వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు ఎన్‌జీవోలతో కూడా బ్యాంకు జతకట్టింది. హైదరాబాద్‌లో జూన్ 8,9 తేదీల్లో దుర్గం చెరువు, గోల్కొండ కోట వద్ద ఈ డ్రైవ్ ఉంటుంది.
ఇందులో బ్యాంకు ఉద్యోగులు, కస్టమర్లు, స్థానిక కమ్యూనిటీలు, పర్యావరణ యాక్టివిస్టులు, స్థానిక అధికారులు, వాలంటీర్లు పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి విస్తృత ప్రాచుర్యం కల్పించేందుకు 18 రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు (ఆర్‌డబ్ల్యూఏ), 9 మాల్స్, 2 క్లబ్స్, 5 సినిమా హాల్స్‌తో పాటు ఎంపిక చేసిన 34 ప్రదేశాల్లో బ్యాంకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
ఈ యాక్టివిటీ ద్వారా, సిమ్యులేటెడ్ వాతావరణంలో, వర్చువల్‌గా ప్రసిద్ధ భారతీయ కట్టడాలను పరిశుభ్రం చేసే గేమ్‌లో కస్టమర్లు పాల్గొనవచ్చు.
“మన పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా చేసే ఏ చిన్న పనయినా పెద్ద ప్రభావమే చూపగలదని యాక్సిస్ బ్యాంక్ విశ్వసిస్తుంది. ఈ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అర్థవంతమైన మార్పులు తేగలిగే కార్యక్రమాల్లో మా ఉద్యోగులు, కస్టమర్లు ,కమ్యూనిటీ భాగస్వాములు పాల్గొనేలా అందరినీ ఒకతాటిపైకి తెస్తున్నాం.
కేవలం మా పరిసరాలను పరిశుభ్రం చేయడం మాత్రమే కాదు, అందరు బాధ్యతను పంచుకునేలా, హరిత భవిష్యత్తుపై ఆకాంక్షలను పెంపొందించేలా చూసేందుకు కృషి చేస్తున్నాం.
మన భవిష్యత్తును కాపాడుకోవడానికి మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ఎంత ముఖ్యమనేది మనం చేసే సమిష్టి కృషి ద్వారా తదుపరి తరానికి కూడా తెలియగలదు” అని యాక్సిస్ బ్యాంక్ ప్రెసిడెంట్, బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్ Ms. అర్నికా దీక్షిత్ (Ms. Arnika Dixit, President and Head – Branch Banking, Axis Bank) తెలిపారు.
ముంబై కార్యాలయంలో కూడా యాక్సిస్ బ్యాంక్ కొన్ని కార్యక్రమాలు నిర్వహించింది. గేమ్స్, పజిల్స్, వర్డ్ సెర్చ్ చాలెంజ్‌లు, క్విజ్‌ల రూపంలో అవగాహన కార్యక్రమాలు, ఎన్‌జీవోలకు చెందిన పర్యావరణ అనుకూల ఉత్పత్తులను ప్రదర్శించేందుకు, విక్రయించేందుకు ఎగ్జిబిషన్ నిర్వహణ మొదలైనవి వీటిలో ఉన్నాయి.
మన పర్యావరణంపై అవగాహన పెంచే విధంగా, మరింత పర్యావరణ అనుకూల భవిష్యత్ దిశగా పని చేసేలా ఉద్యోగులను ప్రోత్సహించే విధంగా ఈ ప్రోగ్రాం రూపొందించింది.
గతేడాది అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశంలోని 18 నగరాల్లో 25 జలాశయాలను శుభ్రం చేసేందుకు యాక్సిస్ బ్యాంక్ నిర్వహించిన కార్యక్రమంలో 3,700 మంది పైచిలుకు ఔత్సాహికులు పాల్గొన్నారు. 12,794 కేజీల వ్యర్ధాలు సేకరించబడ్డాయి.
“వారం రోజుల స్వచ్ఛత కార్యక్రమాల సందర్భంగా అత్యధిక సంఖ్యలో జలాశయాలను శుభ్రపర్చడం”, “పలు నగరాలవ్యాప్తంగా అత్యధిక కిలోల వ్యర్ధాలను సేకరించడం” అంశాలకు సంబంధించి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈ ఘనతను గుర్తించింది.
అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం 2024 సందర్భంగా యాక్సిస్ బ్యాంక్ చేపట్టిన కార్యక్రమాలనేవి కార్పొరేట్ సామాజిక బాధ్యత, పర్యావరణ అనుకూల అభివృద్ధి సాధన విషయంలో బ్యాంకుకు గల నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తాయి.
భవిష్యత్ తరాల కోసం భూగోళాన్ని పరిరక్షించేందుకు అంతర్జాతీయంగా జరుగుతున్న ప్రయత్నాలకు అనుగుణంగా యాక్సిస్ బ్యాంక్ ఈ కార్యక్రమాలతో తన వంతు తోడ్పాటు అందిస్తోంది.
ఈ స్వచ్ఛత డ్రైవ్‌లో భాగమయ్యే టూరిస్ట్ ప్రాంతాల జాబితా –
యాక్టివిటీ ప్రాంతం పేరు | నగరం పేరు |
బాంద్రా కార్టర్ రోడ్ | ముంబై |
మాహిమ్ బీచ్ | ముంబై |
డెక్కన్ నాడి పాత్ర (Deccan Nadi Patra) | పుణె |
కలంగూట్ బీచ్ | గోవా |
ఎకో పార్క్ | కోల్‌కతా |
వారణాసి ఘాట్స్ | వారణాసి |
జపానీస్ గార్డెన్ | నాగ్‌పూర్ |
తాజ్‌పూర్ బీచ్ | తాజ్‌పూర్ |
కజిరంగా నేషనల్ పార్క్ | గువాహటి |
పూరీ బీచ్ | పురీ |
పత్రాతు వేలీ & డ్యామ్ (Patratu Valley & Dam) | రాంచీ |
మాల్ రోడ్ | సిమ్లా |
కుతుబ్ మినార్ | ఢిల్లీ |
ఆల్బర్ట్ హాల్ మ్యూజియం | జైపూర్ |
కైలాసగిరి హిల్ | వైజాగ్ |
రిషికొండ బీచ్ | వైజాగ్ |
నంది హిల్స్ | బెంగళూరు |
సుల్తాన్ బతేరీ (Sultan Batheri) | మంగళూరు |
మాల్పె బీచ్ (Malpe Beach) | ఉడిపి |
గోల్కొండ కోట | హైదరాబాద్ |
దుర్గం చెరువు | హైదరాబాద్ |
ఫోర్ట్ కొచ్చి | ఎర్నాకుళం |
చేరయ్ బీచ్ | ఎర్నాకుళం |