Fri. Jul 5th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,జూన్ 11,2024: ప్రపంచ పర్యావరణ దినోత్సవం ’24 సందర్భంగా భారతదేశపు ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ హైదరాబాద్‌లోని గోల్కొండ కోట ,దుర్గం చెరువులో ‘ఓపెన్ ఫర్ ది ప్లానెట్ క్లీనథాన్’ పేరిట పరిశుభ్రత డ్రైవ్ నిర్వహించింది.

బ్యాంకు బ్రాంచీ ఉద్యోగులు, స్థానిక కమ్యూనిటీలు, పర్యావరణ యాక్టివిస్టులు/ఇన్‌ఫ్లుయెన్సర్లు, స్థానిక అధికారులతో పాటు 600 మంది పైచిలుకు వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సదరు పర్యాటక ప్రాంతం నుంచి 1310 కేజీల సంచిత వ్యర్ధాలను సేకరించారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత ప్రాధాన్యత గురించి స్థానికులకు వాలంటీర్లు అవగాహన కల్పించారు.

బ్యాంక్ చేపట్టిన ‘ఓపెన్ ఫర్ ది ప్లానెట్ క్లీనథాన్’ కార్యక్రమం భారతదేశవ్యాప్తంగా ముంబై, పుణె, వారణాసి, న్యూఢిల్లీ, గువాహటి, విశాఖపట్నం,హైదరాబాద్ నగరాలు సహా పర్యాటకులు అత్యధికంగా సందర్శించే 20 పైచిలుకు ప్రాంతాల్లో జూన్ 5 నుంచి 12 వరకు ఉంటుంది. “మన భూమి.

మన భవిష్యత్తు. మనం #GenerationRestoration” (“Our land. Our future. We are #GenerationRestoration”) అంటూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2024 కోసం ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన థీమ్‌కి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని బ్యాంకు నిర్వహిస్తోంది.

“మన భూగ్రహాన్ని కాపాడుకోవడమనేది మనలో ప్రతి ఒక్కరి బాధ్యత అని యాక్సిస్ బ్యాంక్ విశ్వసిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా తోటి పౌరుల్లో పర్యావరణంపై అవగాహన, బాధ్యతను పెంపొందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.

భవిష్యత్తును పరిరక్షించుకునేందుకు మన పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గురించి కొత్త తరానికి తెలియజేసేందుకు ఈ సమష్టి కృషి తోడ్పడగలదని మేము ఆశిస్తున్నాం” అని కార్యక్రమాల్లో పాల్గొన్నవారిని ప్రశంసిస్తూ యాక్సిస్ బ్యాంక్ ప్రెసిడెంట్ & హెడ్ (బ్రాంచ్ బ్యాంకింగ్) Ms. ఆర్నికా దీక్షిత్ (Ms. Arnika Dixit) తెలిపారు.

Also read : Axis Bank organizes cleanliness drive at Golconda Fort and Durgam Cheruvu in Hyderabad

Also read : Lenovo introduces end-to-end desktop customization for gamers in India

ఇది కూడా చదవండి : ఐఓఎస్ 18లో యాప్ లాక్..

Also read : HDFC Bank Chief Economist, Mr. Abheek Barua comments on RBI policy