365తెలుగు డాట్ కామ్ ఆన్ న్యూస్,ముంబై,నవంబర్ 9,2024: భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫండ్ హౌస్‌లలో ఒకటైన యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, తమ కొత్త ఫండ్ ఆఫర్ – యాక్సిస్ క్రిసిల్ – ఐబీఎక్స్ ఎఎఎ ఫైనాన్షియల్ సర్వీసెస్ – సెప్టెంబర్ 2027 ఇండెక్స్ ఫండ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ పథకం క్రిసిల్-ఐబీఎక్స్ ఎఎఎ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్-సెప్టెంబర్ 2027లోని సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టే ఓపెన్-ఎండెడ్ టార్గెట్ మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్.
ఇందులో ఒక మోస్తరు వడ్డీ రేట్లపరమైన రిస్కులు, మిగతావాటితో పోలిస్తే తక్కువ క్రెడిట్ రిస్కులు ఉంటాయి. ఈ కొత్త ఫండ్, క్రిసిల్-ఐబీఎక్స్ ఎఎఎ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్-సెప్టెంబర్ 2027కి అనుగుణంగా ఉంటుంది. ఈ ఫండ్‌ను ఆదిత్య పగారియా నిర్వహిస్తారు. కనీసం రూ. 5,000, ఆ తర్వాత నుంచి రూ. 1 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతం ఎగ్జిట్ లోడ్ లేదు.
యాక్సిస్ క్రిసిల్ – ఐబీఎక్స్ ఎఎఎ ఫైనాన్షియల్ సర్వీసెస్ – సెప్టెంబర్ 2027 ఇండెక్స్ ఫండ్
ట్రాకింగ్ ఎర్రర్/ట్రాకింగ్ వ్యత్యాసాలకు లోబడి, క్రిసిల్ – ఐబీఎక్స్ ఎఎఎ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ – సెప్టెంబర్ 2027లోని సెక్యూరిటీలు అందించే మొత్తం రాబడులకు దాదాపు సరిసమాన స్థాయిలో (ఫీజులు, వ్యయాలను తీసివేయడానికన్నా ముందు) పెట్టుబడులపై రాబడులు అందించాలనేది ఈ స్కీము లక్ష్యం. అయితే, స్కీము,పెట్టుబడి లక్ష్యం నెరవేరడంపై కచ్చితమైన హామీ ఉండదు. అండర్‌లయింగ్ అసెట్స్‌లో 95% నుంచి 100% వరకు మొత్తాన్ని క్రిసిల్ – ఐబీఎక్స్ ఎఎఎ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ – సెప్టెంబర్ 2027ను ప్రతిబింబించే ఫిక్సిడ్ ఇన్‌కం సాధనాల్లోను, మిగతా మొత్తాన్ని లిక్విడిటీ అవసరాల కోసం డెట్,మనీ మార్కెట్ సాధనాల్లోనూ ఈ స్కీము ఇన్వెస్ట్ చేస్తుంది. (సవివర అసెట్ అలొకేషన్ & పెట్టుబడి వ్యూహం కోసం దయచేసి SIDని చూడండి)
ఓపెన్ ఎండెడ్ ఫండ్ అయినందున ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి లక్ష్యాలకు అనుగుణంగా తగిన సమయంలో ఎంట్రీ, ఎగ్జిట్ కోసం సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్,విత్‌డ్రాయల్ సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు. ఈ ఫండ్ పాసివ్‌గా నిర్వహించబడే స్కీము. ఇది మొత్తాన్ని క్రిసిల్ – ఐబీఎక్స్ ఎఎఎ ఫైనాన్షియల్ సర్వీసెస్ – సెప్టెంబర్ 2027లోని సెక్యూరిటీల్లో పెట్టుబడులకు అవకాశం కల్పిస్తుంది.
అలాగే దానికి అనుగుణమైన పనితీరును (వ్యయాలకు ముందు) కనపరుస్తుంది. అలాగే, ఈ స్కీము కొనుగోలు చేయడం, హోల్డ్ చేయడమనే పెట్టుబడి వ్యూహాన్ని పాటిస్తుంది. రిడెంప్షన్లు/రీబ్యాలెన్స్ కోసం విక్రయిస్తే తప్ప ఆర్థిక సేవల రంగంలోని డెట్ సాధనాలను మెచ్యూరిటీ వరకూ అట్టే పెట్టుకునే విధంగా ఈ విధానం ఉంటుంది.
ఫండ్, ప్రధాన ఫీచర్లు:
- ఇండెక్స్ YTM: 7.72% (2024 నవంబర్ 3 నాటికి)*
- తక్కువ వ్యయాలతో కూడుకున్న పాసివ్ ఇన్వెస్ట్‌మెంట్: తక్కువ వ్యయాలతో కూడుకున్న ఇన్‌కం ప్రోడక్టును కోరుకునే ఇన్వెస్టర్లకు అనువైన సొల్యూషన్
- అత్యంత నాణ్యమైన పోర్ట్‌ఫోలియో: ప్రధానంగా ఎఎఎ రేటెడ్ అసెట్స్‌లో, మిగతా మొత్తాన్ని లిక్విడిటీ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేస్తుంది
- సెక్యూరిటీల ఎంపికలో పక్షపాత ధోరణి తగ్గుతుంది: ఫండ్ పాసివ్‌గా నిర్వహించబడటం వల్ల మరియు క్రిసిల్-ఐబీఎక్స్ ఎఎఎ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ – సెప్టెంబర్ 2027కి అనుగుణంగా ఉంటుంది కాబట్టి సెక్యూరిటీల ఎంపికలో పక్షపాత ధోరణి తగ్గుతుంది
- సరళతరం, సులభతరం: టార్గెట్ మెచ్యూరిటీ ఆర్థిక సేవల రంగ పోర్ట్‌ఫోలియో
*Axis AMC is not assuring/guaranteeing any returns on investment in the Scheme.
పై ఫీచర్లన్నీ 2024 నవంబర్ 3 నాటికి ఉన్న సూచీ వివరాలపై ఆధారితమైనవి
“యాక్సిస్ క్రిసిల్-ఐబీఎక్స్ ఎఎఎ బాండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ – సెప్టెంబర్ 2027 ఇండెక్స్ ఫండ్ అనేది మా తొలి ‘ఫైనాన్షియల్ సర్వీసెస్’ రంగ ఆధారిత టార్గెట్ మెచ్యూరిటీ మ్యుచువల్ ఫండ్ స్కీము. ఇన్వెస్టర్లు అత్యంత నాణ్యమైన, ఎఎఎ-రేటెడ్ పోర్ట్‌ఫోలియోలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇన్వెస్టర్లకు అవకాశం కల్పిస్తుంది. ఎంతో కొంత అంచనా వేయతగిన విధమైన పనితీరును కోరుకునే ఇన్వెస్టర్లకు టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్ లాభసాటి ఆప్షన్లుగా ఉంటాయి. కొత్తగా ప్రారంభించిన ఈ స్కీము, యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ యొక్క పాసివ్ డెట్ పథకాల శ్రేణిలో మరో కీలకమైన పథకం కాగలదు” అని యాక్సిస్ ఏఎంసీ ఎండీ & సీఈవో Mr. బి. గోప్‌కుమార్ తెలిపారు.
ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్‌వో) 2024 నవంబర్ 08 నుంచి నవంబర్ 21 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటుంది.
మరింత సమాచారం కోసం దయచేసి www.axismf.com ని సందర్శించండి.