365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, 16 నవంబర్ 2024: తెలుగు ప్రేక్షకులకు ప్రతివారం కొత్త సినిమాలతో వినోదాన్ని అందిస్తున్న జీ తెలుగు ఈ ఆదివారం మరో ప్రత్యేకమైన విందు అందించనుంది. టాలీవుడ్ యువ కథానాయకుడు నార్నె నితిన్, నయన్ సారిక జంటగా నటించిన ఆయ్ సినిమా ఈ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ప్రసారమవుతోంది. థియేటర్‌లో ఘన విజయం సాధించిన ఈ సినిమా, బుల్లితెర ప్రేక్షకుల మనసులను గెలుచుకోవడానికి సిద్ధమైంది.
సినిమా కథ..
గోదావరి నదిలోని పసలపుడిలంక నేపథ్యంలో సాగిన ఈ రొమాంటిక్ కామెడీ కథలో కార్తీక్ (నార్నె నితిన్), సుబ్బు (కసిరెడ్డి రాజ్ కుమార్), హరి (అంకిత్ కొయ్య) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వర్క్ ఫ్రం హోం కోసం ఊరికి వచ్చిన కార్తీక్, పల్లవి (నయన్ సారిక) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. పల్లవికి కూడా కార్తీక్ అంటే ఇష్టమవుతుంది. అయితే అదే అమ్మాయిని సుబ్బు కూడా ప్రేమించడం వల్ల వారిద్దరి మధ్య ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. పల్లవి ఎవరి ప్రేమను అంగీకరిస్తుంది? వాటిని వారు ఎలా పరిష్కరించారు? తెలియాలంటే నవంబర్ 17న ప్రసారమయ్యే ఆయ్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

సినిమా విశేషాలు..
అంజి కె మణిపుత్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుని ఘన విజయాన్ని సాధించింది. ఆకర్షణీయమైన కథాంశం, ఊహించని మలుపులు, ముద్దుగా నవ్వించే కామెడీ పంచులతో సినిమా ఆద్యంతం అలరిస్తుంది.
డోంట్ మిస్..!
సూపర్ హిట్ మూవీ ఆయ్, నవంబర్ 17, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మీ జీ తెలుగులో ప్రసారమవుతోంది. డోంట్ మిస్!