365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 25,2024: అయోధ్యలోని రామ మందిరం ఎట్టకేలకు ప్రారంభించిన విషయం తెలిసిందే. అరుదైన వివాదానికి తెరదించి, ఈ ఆలయం నిర్మించారు. సుప్రీం కోర్టు ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం చేసింది. ప్రజలు ఆలయానికి విరాళాలు పంపారు, ఇది ప్రజల విరాళాలతో నిర్మించిన మొదటి ఆలయం.
ఇప్పుడు అందరూ అయోధ్యఆలయానికి పంపిన ఒక చెక్కు గురించి మాట్లాడుతున్నారు. సమాచారం ప్రకారం, ఆలయ ట్రస్టుకు రూ. 2100 కోట్ల చెక్కు పంపారు. ఈ మొత్తం ఆలయానికి ఇప్పటివరకు వచ్చిన అతి పెద్ద విరాళంగా చూడవచ్చు. అయితే, ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఆ చెక్కును ఎవరి పేరుతో పంపారంటే..?
ఆ చెక్కును పంపిన దాత దానిని ప్రధాన మంత్రి సహాయ నిధి పేరులో పంపారు. ఈ విషయం ఆలయ ట్రస్టు సభ్యులకు పెద్ద షాకింగ్ అయ్యింది. ఈ విషయంపై మరింత స్పష్టత కోసం ట్రస్టు ఆ చెక్కును ప్రధానమంత్రి కార్యాలయానికి పంపాలని నిర్ణయించింది. చెక్కు కొన్ని రోజుల క్రితం అందినట్టు తెలిపింది.
మరోవైపు, ఆలయ ట్రస్టుకు వచ్చిన విరాళాల వివరాలు, ఖర్చుల వివరాలు కూడా బయటపడ్డాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర బ్యాంక్ ఖాతాలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో 2,600 కోట్లు ఉన్నాయి. ఖర్చు విషయానికొస్తే, ఆలయ నిర్మాణం కోసం ట్రస్టు ఇప్పటివరకు రూ. 776 కోట్లు ఖర్చు చేసింది. ఆలయ నిర్మాణం, ఇతర ఖర్చుల కోసం ఇప్పటివరకు రూ. 1,850 కోట్లు ఖర్చు చేసినట్టు ట్రస్టు తెలిపింది.