Mon. Dec 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,మార్చి 26,2022: ఎస్వీ ఆయుర్వేద క‌ళాశాల, వైద్య‌శాల ఆధ్వ‌ర్యంలో రామ‌చంద్రాపురం మండ‌లం కుప్పం బాదురు గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన ఉచిత‌ ఆయుర్వేద వైద్య శిబిరం ,ఆయుర్వేదంలో చెప్ప‌బ‌డిన‌ ఆరోగ్య నియ‌మాల‌ అవగాహన కార్యక్రమానికి గ్రామస్తుల నుండి విశేష స్పందన లభించింది.

ఈ ఆయుర్వేద వైద్య శిబిరంలో గ్రామస్తులకు రక్త, వైద్య పరీక్షలు నిర్వ‌హించి, వా
వ్యాధుల‌ను నిర్ధారించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గ్రామంలోని ఉన్న‌త పాఠశాల విద్యార్థులకు ఆయుర్వేదం లో చెప్పబడిన ఆహారం, ఆరోగ్య నియ‌మాల‌ను తెలియజేశారు.

అనంత‌రం 8, 9, 10వ తరగతి బాలికలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రుతుస్రావం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ సునీల వివరించారు.

error: Content is protected !!