Fri. Dec 13th, 2024
Medicall expo365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,మార్చి 2, 2023 : మెడ్ ఎక్స్పర్ట్ బిజినెస్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించే అతిపెద్ద బీ2బీ మెడికల్ ఉపకరణాల ట్రేడ్ ఫెయిర్ అయిన మెడీకాల్ మార్చి 17 నుంచి 19 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతుంది.

ఈ మెడీకాల్ 32వ ఎడిషన్ సర్జికల్ కాటన్ నుంచి అధునాతన ఇమేజింగ్ పరికరాలు, శస్త్రచికిత్స ఉపకరణాల వరకు ఆసుపత్రిలోని అన్ని అవసరాలపై దృష్టి పెడుతుంది.

మెడీకాల్ వారు షోస్టాపర్ అయిన ఒక ఇంటరాక్టివ్ బ్రెయిన్‌స్టార్మ్ కూడా నిర్వహిస్తున్నారు.

మెడీకాల్ లో, వైద్యం నిర్వహణ కలిసి మేధోపరంగా ఉత్తేజపరిచే సెమినార్లు, వర్క్‌షాప్‌లు, అన్‌కాన్ఫరెన్స్ లు, ఆసుపత్రులని నడపడంలోని వ్యాపార అంశాలపై పరిజ్ఞానాన్ని పొందడానికి, వ్యాప్తి చేయడానికి మెడికల్ ఫ్రెటర్నిటీ కోసం ఓపెన్ డిస్కషన్ సెషన్‌లని అందిస్తుంది.

మెడీకాల్ బ్రెయిన్‌స్టార్మ్ లోని ఇంటరాక్టివ్ హెల్త్ కేర్ ఇంటెలిజెంట్సియా క్లుప్తంగా జ్ఞానాన్ని అందిస్తుంది.

Medicall expo365

అలాగే, సిమ్యులేషన్ ఆధారిత వర్క్ షాప్ ల ద్వారా ప్రతిభ, నైపుణ్యాలని అభివృద్ధి చేసే లక్ష్యంతో మెడీకాల్ అకాడమీని పరిచయం చేస్తుంది. హెల్త్‌కేర్ పరిశ్రమలో ఉపయోగించే కొత్త నైపుణ్యాలు, సాంకేతికతలపై ప్రత్యక్ష అనుభవాన్ని ప్రేరేపిస్తుంది.

2006 నుండి, చెన్నై, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్కతా, హైదరాబాద్, కొలంబోలలో మెడీకాల్ ప్రదర్శనలని నిర్వహిస్తున్నారు. మెడీకాల్ 31 విజయవంతమైన ఎడిషన్లను పూర్తి చేసింది.

ఎక్స్ పో గురించి మాట్లాడుతూ “ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందిన చిన్న, మధ్య తరహా ఆసుపత్రుల యజమానులు అర్హత కలిగిన పర్చేజ్ మేనేజర్లను కలిగి ఉండలేరు. ఈ ఆసుపత్రుల యజమానులందరినీ కలవడానికి పరికరాల కంపెనీల వద్ద తగినంత సేల్‌ఫోర్స్ కూడా లేదు.

నేను నా ఆసుపత్రి కోసం కష్టాన్ని ఎదుర్కొన్నాను కాబట్టి, మెడీకాల్ అన్ని పరికరాల తయారీదారులని ఒకే చోటుకి చేరుస్తుందని నేను అనుకున్నాను,” అని మెడీకాల్ వ్యవస్థాపకులు, సీఈఓ ఎస్ మణివణ్ణన్ అన్నారు.

అన్నీ మెడికల్ ల్యాబ్ ఉత్పత్తులు, రీఏజెంట్స్, ఇతర ల్యాబ్ సొల్యూషన్స్, ఆటోమేషన్స్ తో మెడీకాల్ హైదరాబాద్ లో ప్రత్యేక ల్యాబ్ పెవిలియన్ ను ప్లాన్ చేశారు. మరిన్ని వివరాలకు సందర్శించండి: http://www.medicall.in

error: Content is protected !!