365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జైపూర్, సెప్టెంబర్13, 2023: భారతదేశంలోని ప్రముఖ ఎంఎస్ఎంఈ రుణాలు, వాహన రుణ ప్రదాతలలో ఒకటైన బైద్ ఫిన్ సెర్వ్ లిమిటెడ్ ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిప‌దిక‌న‌ రూ .250 కోట్లకు మించకుండా నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు జారీ చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

2023 సెప్టెంబర్ 7న జరిగిన 32వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఈ జారీకి ఆమోదం తెలిపింది. ఈ ఇష్యూ నియమనిబంధనలను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయిస్తారు.

1991లో ఏర్పాటైన‌ బైద్ ఫిన్సర్వ్ లిమిటెడ్ భారతదేశపు ప్రముఖ వాహన రుణం, ఎంఎస్ఎంఇ రుణ ప్రదాత. డిపాజిట్లు తీసుకోని ఎన్‌బీఎఫ్‌సీగా, కంపెనీ వాహ‌న రుణాలు, వాణిజ్య వాహన రుణాలు (కొత్త, ఉపయోగించిన), ఎంఎస్ఎంఈ రుణాలు, ఆస్తుల‌పై రుణం, ఇతర ఆస్తి ఆధారిత రుణాలను అందిస్తుంది.

నిరుపేదలకు సేవలందించడంపై బాగా దృష్టి సారించిన ఈ సంస్థ.. ఇటీవల తన కార్యకలాపాలను మధ్యప్రదేశ్ తో పాటు రాజస్థాన్ లోని సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది.

అన్ని లావాదేవీల్లో అత్యంత పారదర్శకతను పాటిస్తూ సహేతుకమైన ఖర్చుతో రుణాల‌ను అంద‌రికీ అందుబాటులోకి తీసుకురావడమే బైద్ ఫిన్ సర్వ్ ముఖ్య ఉద్దేశం.

2023 జూన్ నెల‌తో ముగిసిన 2024 ఆర్థిక సంవ‌త్స‌రం మొద‌టి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.2.40 కోట్ల నుంచి 131 శాతం వృద్ధితో రూ.5.61 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

2023ఆర్థిక సంవ‌త్స‌రం మొద‌టి త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.12.83 కోట్లతో పోలిస్తే 29.6 శాతం వృద్ధితో రూ.18.24 కోట్లకు పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుకు రూ.0.10 (రూ.2 ఈక్విటీ షేర్‌లో 5 శాతం) తుది డివిడెండును కంపెనీ తన వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించింది.