365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 14,2025: త్రిచక్ర వాహన రంగంలో అగ్రగామి బజాజ్ ఆటో లిమిటెడ్, తెలంగాణలో తన తొలి పూర్తి ఎలక్ట్రిక్ మూడు చక్రాల వాహన శ్రేణి ‘బజాజ్ గోగో’ను సోమవారం ఆవిష్కరించింది.

సోమాజీగూడాలోని ది పార్క్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బజాజ్ ఆటో ఇంట్రాసిటీ బిజినెస్ యూనిట్ అధ్యక్షుడు సమర్దీప్ సుబంధ్, శ్రీ వినాయక బజాజ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వి. బాబుల్ రెడ్డి ఈ వాహనాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ‘‘పర్యావరణహిత ఈవాహనాల వినియోగం నగరాల్లో శుద్ధవాతావరణం కోసం అవసరం. బజాజ్ లాంటి సంస్థలు ముందుకు రావడం హర్షణీయం’’ అని తెలిపారు.

ఇది కూడా చదవండి…ZEE5లో రికార్డులు బద్దలు కొట్టిన ‘అయ్యనా మానే’ వెబ్ సిరీస్.. మే 16 నుంచి తెలుగులో స్ట్రీమింగ్

Read this also..ZEE5’s Record-Breaking Blockbuster Web Series “Ayyana Mane” To Release In Telugu On May 16

విభాగంలోనే అత్యధిక రేంజ్
గోగో వాహనం ఒకసారి ఛార్జ్ చేస్తే 251 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఇది ఈ విభాగంలో అత్యధికమైన రేంజ్ అని సంస్థ ప్రకటించింది. మూడు వేరియంట్లుగా ఈ వాహనాలు లభ్యమవుతాయి – P5009, P5012, P7012. ఇందులో ‘P’ అంటే ప్యాసింజర్, ‘09’, ‘12’ అనేవి వరుసగా 9 kWh, 12 kWh బ్యాటరీ సామర్థ్యాలను సూచిస్తాయి.

ఫీచర్స్
గోగో ఈ-ఆటోలో హిల్ హోల్డ్ అసిస్టు, ఆటో హజార్డ్ లైట్స్, యాంటీ రోల్ డిటెక్షన్ వంటి సదుపాయాలు తొలిసారిగా అందుబాటులోకి తీసుకువచ్చారు. టూ-స్పీడ్ ఆటోమేటెడ్ ట్రాన్స్‌మిషన్ వలన అదనపు పరిధి, మెరుగైన రోడ్ గ్రీప్ లభిస్తాయి. వాహనానికి 5 సంవత్సరాల బ్యాటరీ వారంటీ ఉంటుంది. మెటల్ బాడీ, శక్తివంతమైన ఎల్ఈడి లైట్లు కూడా ఉన్నాయి.

ప్యాసింజర్ వేరియంట్లైన P5009 ధర రూ.3,26,797 కాగా, P7012 ధర రూ.3,83,004గా నిర్ణయించారు (ఎక్స్ షోరూం ఢిల్లీ). దేశవ్యాప్తంగా ఉన్న బజాజ్ డీలర్‌షిప్‌లలో బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సంస్థ “ప్రీమియం టెక్‌ప్యాక్” పేరిట రిమోట్ ఇమ్మొబిలైజేషన్, రివర్స్ అసిస్ట్ లాంటి అదనపు ఫీచర్లు కలిగిన ఎంపికను కూడా అందిస్తోంది.

“తెలంగాణకు సహజ లాంచ్‌ప్యాడ్”
ఈ సందర్భంగా సమర్దీప్ సుబంధ్ మాట్లాడుతూ, ‘‘తెలంగాణ రాష్ట్రం త్రీ-వీలర్ వాహనాలకు పెద్ద మార్కెట్. గోగో సిరీస్ వాహనాలు తెలంగాణ నుంచే ప్రారంభించటం మా భాగ్యంగా భావిస్తున్నాం.

ఇది కూడా చదవండి…పీజేటీఏయూ – వెస్టర్న్ సిడ్ని విశ్వవిద్యాలయం సంయుక్తంగా కొత్త వ్యవసాయ కోర్సులు

ఇది కూడా చదవండి…ప్రముఖ సైకాలజిస్ట్ డా. హిప్నో పద్మా కమలాకర్‌ ను ఘనంగా సత్కరించిన నిఖిల కన్స్ట్రక్షన్స్ సంస్థ..

75 ఏళ్ల అనుభవం, నమ్మకంతో రూపొందించిన ఈ వాహనాలు డ్రైవర్ల ఆదాయాన్ని పెంచేలా, నిర్వహణ ఖర్చులను తగ్గించేలా ఉంటాయి. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ప్రారంభించి త్వరలో రాష్ట్రవ్యాప్తంగా మా సేవలను విస్తరిస్తాం’’ అన్నారు.