365తెలుగు డాట్ కామన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఏప్రిల్ 4,2023: ఇటీవలి టాలీవుడ్ సంచలనం బలగం ఓటిటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రారంభమైన తర్వాత కూడా థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. వేణు యెల్దండి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్‌లు జంటగా నటించారు.
అమెజాన్ ప్రైమ్ వీడియోను పైరసీ చేసి సిరికొండ గ్రామంలో బహిరంగంగా ప్రదర్శించిన వారిపై బలగం చిత్ర నిర్మాత దిల్ రాజు నిజామాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం పై దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు.
“మేము కావాలని, బలగం సినిమా ప్రదర్శనలను అడ్డుకోవడంలేదు. అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ నుంచి ఒత్తిడి రావడంవల్లే పిర్యాదు చేశామని చిత్ర నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ లో వెల్లడించారు. అందరికీ సినిమా చేరాలనే సదుద్దేశం తమకు ఉందని ,అందుకోసం ఎవరికైనా అవసరం ఐతే తామే అవసరమైన గ్రామాల్లో సినిమాను ప్రదర్శిస్తామని ఆయన వెల్లడించారు.
బలగం చిత్రంలో మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రచ్చ రవి, తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. భీమస్ సెసిరోలె ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
ఇవి కూడా చదవండి…