365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యుస్,జూలై 8,హైదరాబాద్: ఈ నెల 13 న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగనున్నది. అందులోభాగంగా ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. బల్కంపేట రేణుక ఎల్లమ్మ టెంపుల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్నపూర్ణ బుధవారం పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయశాఖామంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలకు అమ్మవారి కళ్యాణ ఆహ్వానపత్రిక అందించారు.
జూలై 12న ఎదుర్కోళ్ళు,13న కళ్యాణం,14న రధోత్సవం నిర్వహించడం జరుగుతుందని బల్కంపేట రేణుక ఎల్లమ్మ టెంపుల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్నపూర్ణ తెలిపారు.