365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఆగస్టు 2024: వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బంధన్ బ్యాంక్ మహిళల కోసం అవని పేరిట ప్రత్యేక సేవింగ్స్ ఖాతాను ఆవిష్కరించింది. అలాగే ఎంటర్‌ప్రైజ్‌వ్యాప్తంగా వినూత్నమైన బంధన్ బ్యాంక్ డిలైట్స్ లాయల్టీ ప్రోగ్రాంను కూడా బ్యాంకు ఆవిష్కరించింది.
ఈ ప్రోగ్రాం కింద కస్టమర్లు, డిలైట్ పాయింట్స్ పేరిట రివార్డ్ పాయింట్లను పొందవచ్చు. అలా పోగుపడిన డిలైట్ పాయింట్లను తమ కొనుగోళ్ల కోసం ఉపయోగించుకోవచ్చు. ప్రత్యేక ఆఫర్లను కూడా ఆస్వాదించవచ్చు.
అవనితో కస్టమర్లు ఎక్స్‌క్లూజివ్ డెబిట్ కార్డును పొందవచ్చు. దీంతో ఉచిత ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, రూ. 10 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీ, కార్డు పోతే రూ. 3.5 లక్షల లయబిలిటీ, ఖర్చు చేయడాన్ని బట్టి ప్రీమియం బ్రాండ్స్ నుంచి బహుళ మైలురాళ్ల ఆధారిత ఆఫర్లను పొందవచ్చు. అవనితో వార్షిక లాకర్ రెంటల్స్, బంగారం రుణాల ప్రాసెసింగ్ ఫీజులపైనే కాకుండా బ్యూటీ,వెల్‌నెస్ ఉత్పత్తులపై కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు లభిస్తాయి.
బంధన్ బ్యాంక్ డిలైట్స్ అనే ఎంటర్‌ప్రైజ్-వైడ్ లాయల్టీ ప్రోగ్రాంతో కస్టమర్లు అకౌంటు తెరవడం, కార్డు లావాదేవీలు, ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ తదితర లావాదేవీలపై డిలైట్ పాయింట్లు పొందవచ్చు. ట్రావెల్ & స్టే, మర్చండైజ్, వినోదం సహా వివిధ అంశాలపై రివార్డుల కోసం ఆ పాయింట్లను ఈ ప్రోగ్రాం ద్వారా రిడీమ్ చేసుకోవచ్చు. ప్రత్యేక ఆఫర్లను కూడా ఆస్వాదించవచ్చు. పోగుపడిన డిలైట్ పాయింట్స్‌ను కస్టమర్లు ఎయిర్ మైల్స్‌గా కూడా మార్చుకోవచ్చు.
“బంధన్ బ్యాంక్ ఒక యూనివర్సల్ బ్యాంక్‌గా మారి తొమ్మిదేళ్లవుతోంది. ఈ వ్యవధిలో వివిధ వర్గాల కస్టమర్ల అవసరాలను తీర్చేలా మా ప్రోడక్టుల శ్రేణిని పటిష్టపర్చుకున్నాం. మా ప్రస్థానంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు.
బ్యాంకు విజయానికి వారూ తోడ్పడుతున్నారు. అందుకే, మహిళా కస్టమర్ల పట్ల గౌరవసూచకంగా, మా ఫౌండేషన్ డే సందర్భంగా ప్రత్యేకంగా మహిళల కోసం తీర్చిదిద్దిన అవని ప్రోడక్టును ఆవిష్కరించాలని నిర్ణయించుకున్నాం. ఇన్నేళ్లుగా మా విలువైన కస్టమర్ల నుంచి పొందిన విశ్వసనీయత, నమ్మకం, మద్దతుకు గాను వారికి ప్రతిఫలంగా బంధన్ బ్యాంక్ డిలైట్స్‌ను అందిస్తున్నాం.
అందరి బ్యాంకుగా మా బ్యాంకు వెలుగొందుతోంది. ఈ కొత్త ఆవిష్కరణలన్నీ కూడా దానికి అనుగుణంగా ఉంటాయి” అని బంధన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మధ్యంతర) రతన్ కేశ్ తెలిపారు.
“ప్రోడక్టుల శ్రేణిని మరింత విస్తృతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్న బంధన్ బ్యాంక్ ప్రస్థానంలో ఈ ఆవిష్కరణలు వ్యూహాత్మకంగా కీలక మైలురాయిలాంటివి. అవనిని ప్రవేశపెట్టడం ద్వారా మా మహిళా కస్టమర్ల ఆర్థిక, లైఫ్‌స్టయిల్ అవసరాలను తీర్చడం మాత్రమే కాకుండా వేల్యూ యాడెడ్ సర్వీసుల ద్వారా వారికి మరింత మెరుగైన బ్యాంకింగ్ అనుభూతిని కల్పించగలము.
మా విలువైన కస్టమర్లను సముచిత రీతిలో సత్కరించడం, మరింత విలువైన సేవలను అందించే ఉద్దేశంతో బంధన్ బ్యాంక్ డిలైట్స్‌ను ప్రవేశపెట్టడం సంతోషకరమైన విషయం.
మార్కెట్‌ప్లేస్‌లో విభిన్నంగా ఉండటానికి, దీర్ఘకాలికంగా విశ్వసనీయతను పెంపొందించుకోవడానికి, సుస్థిర అభివృద్ధి సాధనకు మేము పాటించే విస్తృత వ్యూహంలో ఇవన్నీ భాగం” అని బంధన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రాజీందర్ బబ్బర్ తెలిపారు.