Thu. Dec 5th, 2024
bandi-sanjay-mp-arvind

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,నవంబర్ 19,2022:బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ శనివారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటికి వెళ్లారు. టీఆర్ఎస్ గూండాల దాడిలో ధ్వంసమైన అరవింద్ నివాసాన్ని పరిశీలించారు. అరవింద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. దాడి పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు.

కీలక వ్యాఖ్యలు చేసిన బండిసంజయ్..

bandi-sanjay-mp-arvind

• ధర్మపురి అరవింద్ నివాసంపై టీఆర్ఎస్ గూండాల దాడులను ఖండిస్తున్నాం. దాడులు చేయాల్సిన అవసరం ఏముంది? అరవింద్ బూతులేమీ మాట్లాడలేదే… వాస్తవాలను ప్రజల ముందుంచారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?

• అరవింద్ అమ్మానాన్నలు పెద్దవాళ్ళు. నాన్న అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంచానికే పరిమితమయ్యారు. నిన్న అద్రుష్టవశాత్తు ఇంట్లో లేరు. ఒకవేళ ఉంటే పరిస్థితి ఏమిటి?

• అరవింద్ నివాసంలో ఉన్న మహిళలపై టీఆర్ఎస్ గూండాలు రాళ్లు విసరడం అందరం చూశాం. మహిళల గురించి మాట్లాడే టీఆర్ఎస్ నేతలు దీనికి ఏం సమాధానం చెబుతారు?

• కేసీఆర్ కుటుంబ అహంకారం ఎక్కువైంది. బీజేపీ చేతిలో ఓటమి ఖాయమనే క్రోమా ఫోబియా పట్టుకుంది. అరవింద్ నివాసంలోని వినాయకుడి, లక్ష్మీ, సరస్వతి అమ్మవార్ల విగ్రహాలను ధ్వంసం చేశారు. నిఖార్సయిన హిందువు అని చెప్పుకొన్న కేసీఆర్ ఎట్లా దాడి చేయిస్తారు? హిందూ సమాజం ఎందుకు భరించాలి?

• దాడులు, ప్రెస్ మీట్ పేరుతో టీఆర్ఎస్ నేతలు ఏదో డ్రామా చేద్దామనుకున్నారు… కానీ జనం నమ్మలేదు. డామిట్ కథ అడ్డం తిరిగిందన్నట్లుగా పరిస్థితి తయారైంది. ధర్మపురి అరవింద్ మాట్లాడితే…. వాళ్ల కుటుంబ సభ్యులపై, నివాసంపై దాడి చేయడమేంది? వాళ్లకు ఏం సంబందం? రాష్టం లో శాంతి భద్రత లు క్షీణించాయణదానికి ఇంతకంటే నిదర్శనం ఎం కావాలి

bandi-sanjay-mp-arvind

• పైగా ఊరికించి కొడతామని అంటున్నరు..రాష్ట్ర ప్రజలే టీఆర్ ఎస్ ను, కేసీఆర్ కుటుంబాన్ని ఉరికించి ఉరికించి తెలంగాణ పొలిమేరలు దాటించి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు.అరవింద్ నివాసంపై దాడి ఘటనకు పోలీసులు బాధ్యులే. బాధ్యలైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. కొందరు పోలీసులు పింక్ డ్రెస్ వేసుకుని టీఆర్ఎస్ కార్యకర్తల్లాగా పని చేస్తున్నారు. ఇది క్షమించరాని విషయం.

• టీఆర్ఎస్ నేతల్లో ఫ్రస్టేషన్ ఎక్కవైంది. కేసీఆర్ కుటుంబంలో అంత:పుర కలహాలు స్టార్ట్ అయినయ్.కేసీఆర్ సీఎంగా, కుటుంబ పెద్దగా, తండ్రి గా ఫెయిల్ అయ్యారు. ప్రజల ద్రుష్టి మళ్లించేందుకే దాడులతో డ్రామాలు చేస్తున్నరు. నిన్నటి దాడి ఘటనను డీకే అరుణ, నేను కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినం. అమిత్ షా అరవింద్ తో ఫోన్ లో మాట్లాడి భరోసా ఇచ్చారు.

• బీజేపీలో చేరాలంటూ ఫోన్ చేశారంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ…. ‘‘కేసీఆర్ నే పట్టించుకోలేదు… ఇగ ఆయన కూతురును ఎవరు పట్టించుకుంటారు?’ అని అన్నారు. 4గురు ఎమ్మెల్యేల వ్యవహారంపై బీఎల్ సంతోష్ కు నోటీసులిచ్చారు. త్వరలో మీకు కూడా ఇస్తారని చెబుతున్నారు… దీనిపై ఏమంటారు? అని అడిగిన ప్రశ్నకు ‘‘మాకు నోటీసులు కొత్తకాదు. నోటీసులొస్తే వాళ్లలెక్క పట్టీలు వేసుకోను… వీల్ చైర్ లో కోర్చోను.

bandi-sanjay-mp-arvind

బరాబర్ తీసుకుంటా. నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతుల సమస్యలు ఎందుకు పట్టించుకోవు? డబుల్ బెడ్రూం ఇండ్లు, రుణమాఫీ సహా ఏ సమస్యలపై స్పందించవు. నిత్యం మంది కొంపలు ముంచాలని చూస్తున్నావు సిగ్గుండాలే. ఈ సినిమాకు ముగింపు మేమే ఇస్తాం..ఏం చేస్తామో త్వరలో మీరే చేస్తారు.

• దాడుల సంస్కృతిపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ… ‘‘దాడులు చేసే సంస్ర్కుతి ఏమాత్రం మంచిది కాదు..మా కార్యకర్తలు దాడి చేసినా తప్పే… దాడులతో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలనుకుంటున్నారు. గడీల పాలనను బద్దలు కొడతాం” అని బండి సంజయ్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ తోపాటు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, అధికార ప్రతినిధులు సీహెచ్.విఠల్, ఎన్వీ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!