365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 22, 2023: భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో సెషన్లో లాభపడ్డాయి. బ్యాంకు షేర్ల పతనంతో ఆద్యంతం ఊగిసలాడిన సూచీలు ఐటీ షేర్ల మద్దతుతో సానుకూలంగా ముగిశాయి.
బెంచ్‌మార్క్ సూచీలైన బీఎస్ఈ సెన్సెక్స్ 92, ఎన్ఎస్ఈ నిఫ్టీ 28 పాయింట్ల మేర పెరిగాయి. మార్కెట్లో మూమెంటమ్ మరింత పెరిగేంత వరకు సూచీలు ఇలాగే కదలాడొచ్చు.
యూఎస్ ఫెడ్ అక్టోబర్ 31 సమావేశం మినట్స్ విడుదలయ్యాయి. భవిష్యత్తులో వడ్డీరేట్లు పెంచడంపై అప్రమత్తంగా ఉండాలని చర్చించడం నెగెటివ్ సెంటిమెంటుకు దారితీసింది.
ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మూడు పైసలు బలపడి 83.32 వద్ద స్థిరపడింది. వరుసగా నాలుగో సెషన్లోనూ విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.306 కోట్ల షేర్లు అమ్మేసి నెట్ సెల్లర్స్‌గా మారారు.
డీఐఐలు రూ.721 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. క్రితం సెషన్లో 65,930 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 65,839 వద్ద మొదలైంది. 66,063 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది.
మళ్లీ ఒడుదొడుకులకు లోనై 65,664 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరింది. చివరికి 92 పాయింట్ల లాభంతో 66,023 వద్ద ముగిసింది. బుధవారం 19,784 వద్ద ఆరంభమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 19,703 వద్ద ఇంట్రాడే కనిష్ఠం, 19,825 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది.
చివరికి 28 పాయింట్లు పెరిగి 19,811 వద్ద క్లోజైంది. ఇక బ్యాంకు నిఫ్టీ 239 పాయింట్ల మేర పతనమైంది. నిఫ్టీ50లో 29 కంపెనీలు లాభపడగా 20 నష్టపోయాయి. బీపీసీఎల్, సిప్లా, బజాజ్ ఆటో, ఇన్ఫీ, ఎన్టీపీసీ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి.
ఇండస్ ఇండ్ బ్యాంకు, కొటక్ బ్యాంకు, అదానీ పోర్ట్స్, హిందాల్కో, అదానీ ఎంటర్ ప్రైజెస్ టాప్ లాసర్స్. ఇండియా విక్స్ 3 శాతం మేర తగ్గడం ఇన్వెస్టర్ల ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తోంది.
నేడు బ్యాంకు, ఫైనాన్స్, మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంకు, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు కళకళలాడాయి
నిఫ్టీ నవంబర్ ఫ్యూచర్స్ ఛార్ట్ గమనిస్తే 19,900 వద్ద రెసిస్టెన్సీ, 19,750 వద్ద సపోర్టు ఉన్నాయి. ట్రేడర్లు స్వల్ప కాలానికి గ్లాండ్ ఫార్మా, మాక్స్ హెల్త్, ఫైజర్, బయోకాన్, టైటాన్ షేర్లను కొనొచ్చు.
నిఫ్టీ పెరగడంలో ఇన్ఫీ, ఐటీసీ, రిలయన్స్, యాక్సిస్ బ్యాంకు, టీసీఎస్ కీలకంగా నిలిచాయి. చిప్ అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్ నెలకొల్పే ప్రణాళిక ఉందని చెప్పడంతో సీజీ పవర్ షేర్లు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయ్యాయి.
షేర్లు రూ.469 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని చేరుకున్నాయి. దాంతో కంపెనీలో 11.6 లక్షల షేర్లు చేతులు మారాయి. నేడు సుజ్లాన్ ఎనర్జీ షేర్లు లోయర్ సర్క్యూట్‌లో ముగిశాయి.
సిప్లా షేర్లు రూ.1283 వద్ద ఇంట్రాడేలో లైఫ్ టైమ్ హై అందుకున్నాయి. జీఎమ్మార్ ఎనర్జీలో తమ వాటాను జీఎమ్మార్ 86.9 శాతానికి పెంచుకోవడంతో కంపెనీ షేర్లు అప్పర్ సర్క్యూట్ తాకాయి.
అశోకా బిల్డ్‌కాన్‌కు ఎన్‌హెచ్ఏఐ నుంచి ప్రావిజినల్ సర్టిఫికెట్ వచ్చింది.
- మూర్తి నాయుడు పాదం
నిఫ్ట్ మాస్టర్
స్టాక్ మార్కెట్ అనలిస్ట్
+91 988 555 9709