Tue. Dec 24th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 4,2023:దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు బంపర్ హిట్టయ్యాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించడం, 2024లో మోదీ సర్కారే వస్తుందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు పోటీపడి మరీ షేర్లు కొన్నారు.

జీడీపీ గణాంకాలు, ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ వంటివి ఇందుకు దన్నుగా నిలిచాయి. దీంతో బెంచ్‌మార్క్ సూచీలు 2 శాతానికి పైగా ఎగిశాయి. నిఫ్టీ 418 పాయింట్లు, సెన్సెక్స్ 1383 పాయింట్ల మేర పెరిగాయి.

బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లు అదరగొట్టాయి. కాగా డాలర్‌తో పోలిస్తే రూపాయి 7 పైసలు బలహీనపడి 83.37 వద్ద స్థిరపడింది. ఇన్వెస్టర్లు నేడు ఒక్కరోజే రూ.6 లక్షల కోట్లకు పైగా సంపద పోగేశారు.

క్రితం సెషన్లో 67,481 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 68,435 వద్ద మొదలైంది. 68,274 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. వెంటనే పుంజుకొని ఆకాశమే హద్దుగా ఎగిసింది.

68,918 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 1383 పాయింట్ల లాభంతో 68,865 వద్ద ముగిసింది. సోమవారం 20,601 వద్ద ఆరంభమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 20,507 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది.

20,702 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. మొత్తంగా 418 పాయింట్లు పెరిగి 20,686 వద్ద క్లోజైంది. ఇక నిఫ్టీ బ్యాంకు 1616 పాయింట్లు ఎగిసి 46,431 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ50లో 44 కంపెనీలు లాభపడగా 6 నష్టపోయాయి. ఐచర్ మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి.

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, బ్రిటానియా, హెచ్‌సీఎల్ టెక్, సన్ ఫార్మా, విప్రో షేర్లు టాప్ లాసర్స్. నిఫ్టీ మీడియా, ఫార్మా మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి.

బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మెటల్, పీఎస్‌యూ బ్యాంకు, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు అదరగొట్టాయి.

నిఫ్టీ50 పెరగడంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు (92), ఐసీఐసీఐ బ్యాంకు (71), ఎల్టీ, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఎస్బీఐ కీలకంగా నిలిచాయి. నిఫ్టీ డిసెంబర్ ఫ్యూచర్స్ ఛార్ట్ గమనిస్తే 20,900 వద్ద రెసిస్టెన్సీ, 20,650 వద్ద సపోర్టు ఉన్నాయి.

ఇన్వెస్టర్లు స్వల్ప కాలానికి గ్లెన్ మార్క్, రిలాక్సో ఫుట్‌వేర్, క్రాంప్టన్, హింద్ జింక్ షేర్ల కొనుగోలును పరిశీలించొచ్చు.

నేడు నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 షేర్లు జీవిత కాల గరిష్ఠాన్ని తాకింది. జీ ఎంటర్‌టైన్మెంటులో స్ర్పుసీగ్రోవ్ 2.3 శాతం వాటాను అమ్మేసింది. ఐరోపా మార్కెట్లు మిశ్రమంగా కదలాడాయి.

సాధనా నైట్రోకెమ్ 15-20 మెగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ ఫెసిలిటీని ఏర్పాటు చేయబోతోంది. ఇందుకోసం రూ.50 కోట్లు సమీకరించేందుకు బోర్డు రైట్స్ ఇష్యూకు ఆమోదించింది.

ఐసీఐసీఐ బ్యాంకులో 10.1 లక్షల షేర్లు చేతులు మారాయి. ఎస్‌జేవీఎన్ ఉత్తరాఖండ్‌లో రెండు హైడ్రో పవర్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. గెయిల్ షేర్లు నేడు రికార్డు గరిష్ఠానికి చేరుకున్నాయి.

పవర్ గ్రిడ్‌లో 41 లక్షలు, టాటా స్టీల్‌లో 17.7 లక్షల షేర్లు చేతులు మారాయి.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709
error: Content is protected !!