365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 9,2024: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ప్రారంభంలో, విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ,పరిశోధన సంచాలకులు డాక్టర్ పి. రఘురామి రెడ్డి గారు గౌరమ్మకి పూజలు చేసి, ‘‘బతుకమ్మ మన సంస్కృతికి ప్రతీక’’ అని తెలిపారు.
తరువాత, మహిళా అధికారులు, ఉద్యోగులు ఒకत्रమై ఆడుతూ పాడుతూ బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.