365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, ఖమ్మం, అక్టోబర్ 2 , 2021: దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అంబేద్కర్ నగర్ సర్పంచ్ జె. కిరణ్ బాబు అన్నారు. అంతేకాకుండా అన్నివర్గాల ప్రజలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే సామాజిక న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు. తల్లడమండలం అంబేద్కర్ నగర్ గ్రామంలో ఆయన బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ స్వర్ణ శ్రీలక్ష్మి, వీఆర్ఓ నరసింహారావు, వార్డు మెంబర్లు కమలకుమారి,జోగరావు, రమణ, సౌరి, ఏఎన్ఎమ్ అరునిమా,ఆశా కార్యకర్త సునీత,అంగన్ వాడీ టీచర్ ప్రమీల తదితరులు పాల్గొన్నారు.