Sun. Dec 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూలై 22,2024: పారిస్ ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న భారత జట్టుకు బీసీసీఐ ఆర్థిక సాయం ప్రకటించింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లే 117 మంది సభ్యులతో కూడిన భారత బృందానికి రూ.8.5 కోట్లు అందించింది BCCI.

ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు జై షా ట్విట్టర్ అకౌంట్ (ఎక్స్) ద్వారా తెలియజేశారు. ‘‘2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున ఆడే మన అథ్లెట్లకు బీసీసీఐ మద్దతివ్వడం గర్వంగా ఉంది.

జట్టు కోసం భారత ఒలింపిక్ సంఘానికి రూ.8.5 కోట్లు ఇస్తున్నాం. ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు.. ప్రతి ఒక్కరూ భారతదేశాన్ని గర్వించేలా చేయాలని కోరుకుంటున్నా.. జై హింద్’ అని జై షా(X)లో రాశారు.

error: Content is protected !!