Mon. Dec 23rd, 2024
Sarada_kuragayala

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఏప్రిల్ 6,2023: రేపు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ శారద కూరగాయల ఒక ప్రచారాన్ని ప్రారంభించారు.

ఈ ప్రచారంలో సినిమా ప్రముఖులు, రాజకీయనాయకులు, కొంతమంది వ్యక్తులు ఒక రోజు మొత్తం శాకాహారి ఆహారాన్ని తీసుకుంటామని సవాలు చేస్తూ మరికొందరిని ప్రోత్సహిస్తారు.

15 ఏళ్లుగా జర్నలిస్టుగా పనిచేసిన శారద “సిమి”పేరుతో గతేడాది “ఆల్ వీగన్ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఆమె కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన మొదటి శాకాహారి భారతీయురాలు కూడా.

వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆమె తన జీవితమంతా ప్రకృతికి దగ్గరగా ఉంటూ, జంతువుల పట్ల తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు.

“బీ వీగన్ ఫర్ ఏ డే” కార్యక్రమంలో ఆస్కార్ అవార్డు గ్రహీత గీత రచయిత చంద్రబోస్, నటులు రవివర్మ,కె నాగబాబుతో సహాపలువురు ప్రముఖులు తమవంతుగా పాలుపంచుకోనున్నారు.

తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ చైర్మన్, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, జర్నలిస్టులు, పలువురు రాజకీయ నాయకులు ఒక రోజు శాకాహారిగా ఉండాలనే సవాలును స్వీకరించారు.

5895 మీటర్ల ఎత్తైన టాంజానియా పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారతీయ శాకాహార మహిళగా శారద ఖ్యాతి సంపాదించారు.

పాలు,పెరుగు ప్రత్యామ్నాయాల కోసం వెతకడం ప్రారంభించారు. సోయా, బాదం, కొబ్బరి, జీడిపప్పు,అనేక ఇతర మొక్కల ద్వారా పాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని ఆమె వెల్లడించారు.

error: Content is protected !!