365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 22,2024: డైరెక్టర్ మారుతి టీమ్ ప్రోడక్ట్, వానరా సెల్యూలాయిడ్ సంయుక్త నిర్మాణంలో రావు రమేష్ ప్రధాన పాత్రలో అంకిత్ కొయ్య, విశాఖ ధిమన్ హీరో హీరోయిన్లుగా బాల సుబ్రహ్మణ్యమ్ దర్శకత్వంలో ఎ.విజయ్ పాల్ రెడ్డి నిర్మాతగా ప్రకాష్ రౌతు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా తెరకెక్కుతున్న చిత్రం “బ్యూటీ”.
ఈ చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగాయి, దర్శకుడు మారుతి క్లాప్ కొట్టగా, మరో దర్శకుడు బుచ్చిబాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు వీర శంకర్, సుబ్బు మంగాదేవి, డార్లింగ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ గా తెరకెక్కబోతున్న బ్యూటీ చిత్రం మే రెండు నుండి హైదరాబాద్ పరిసర పాంతాల్లో షూటింగ్ జరుపుకోనుంది. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సిద్ధం మనోహర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఈ చిత్రానికి ఎడిటర్ గా వర్క్ చేస్తున్న ఈ సినిమాకు సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్.
ఇది కూడా చదవండి: మహీంద్రా Xuv700, స్కార్పియో అండ్ స్కార్పియో N లో వెయిటింగ్ లిస్ట్ ఎంత..?
ఇది కూడా చదవండి: పర్యావరణ అనుకూల పాత్రలు ఎందుకు ముఖ్యమైనవి..?
ఇది కూడా చదవండి: AP SSC result 2024: ఆంధ్రప్రదేశ్ బోర్డ్ 10వ తరగతి ఫలితాలు.