365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు 2, 2025: ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన అకౌంటింగ్ శిక్షణ సంస్థ బెకర్, భారతదేశపు ప్రముఖ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సంస్థ సిమంధర్ ఎడ్యుకేషన్ తో ప్రత్యేక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా సిమంధర్ ఎడ్యుకేషన్, భారతదేశంలో బెకర్ సిపిఏ (CPA), సిఎంఏ (CMA) శిక్షణ కార్యక్రమాలకి ఏకైక అధికారిక భాగస్వామిగా కొనసాగుతుంది.
ఈ ఒప్పందం ద్వారా భారతదేశం అంతటా కామర్స్ విద్యార్థులకు గ్లోబల్ అకౌంటింగ్ కెరీర్‌లపై పునః దృష్టి ఏర్పడుతోంది. ముఖ్యంగా సిపిఏ, సిఎంఏ అభ్యర్థులు ఇకపై AI ఆధారిత అధ్యయన సాధనాలు, అనుభవజ్ఞుల బోధన, ప్రత్యక్ష తరగతులు, పర్సనల్ గైడెన్స్, కెరీర్ ప్లేస్‌మెంట్ మద్దతులతో ప్రయోజనం పొందగలుగుతారు.
Read This also…Hexaware Appoints Shantanu Baruah as President & Global Head of Healthcare, Life Sciences & Insurance..
2020 నుండి భారతదేశంలో సిపిఏ ల సంఖ్య 450% వృద్ధి చెంది ఉండటం ఈ రంగంలో గ్లోబల్ టాలెంట్ గ్యాప్‌ను పూరించడానికి భారత్ ఎంతగానో సిద్ధంగా ఉందని సూచిస్తోంది.
బెకర్ అధ్యక్షుడు ఎడ్ క్లార్క్ మాట్లాడుతూ,

“భారత మార్కెట్‌లో బెకర్ కార్యకలాపాలు గత ఐదేళ్లలో 300% పెరిగాయి. సిమంధర్‌తో భాగస్వామ్యం ద్వారా మరింత మంది విద్యార్థులకు ప్రపంచ స్థాయి వనరులు, లోకల్ మద్దతుతో కలిపి అందించగలమని మేము విశ్వసిస్తున్నాం” అన్నారు.
సిమంధర్ ఎడ్యుకేషన్ సహ వ్యవస్థాపకుడు శ్రీపాల్ జైన్ మాట్లాడుతూ,
“ప్రపంచ అర్హతలతో భారతీయ ప్రతిభ మధ్య అంతరాన్ని తగ్గించడమే మా లక్ష్యం. ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులను కేవలం పరీక్షలకు సిద్ధం చేయడమే కాదు, భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండే ప్రొఫెషనల్స్‌గా తీర్చిదిద్దుతున్నాం” అన్నారు.
ఈ భాగస్వామ్యం ప్రత్యేకంగా టైర్ 2, టైర్ 3 నగరాలలో అకౌంటింగ్ విద్యను విస్తరించేందుకు ఉద్దేశించబడింది. అంతర్జాతీయ ప్రమాణాలపై ఆసక్తి పెరుగుతున్న ఈ ప్రాంతాల్లో సిమంధర్ – బెకర్ కలిసి నూతన అవకాశాలు అందించనున్నాయి.