KONNECT IMAGING DIAGNOSITCS

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జనవరి 5, 2023: తెలంగాణ రాష్ట్రంలో అత్యుత్తమ సేవలందించినందుకు కనెక్ట్ ఇమేజింగ్ అండ్ డయాగ్నస్టిక్ సెంటర్ కు తెలంగాణ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ అవార్డ్ , దుబాయ్ లో జరిగిన రేడియో సిటీ అవార్డుల ప్రదానోత్సవంలో ఎమర్జింగ్ డయాగ్నస్టిక్ చెయిన్ అవార్డు వచ్చింది.

ప్రస్తుతం జీవనశైలి ఆరోగ్య సమస్యలతోపాటు కొత్త వ్యాధులు సోకుతున్న నేపథ్యంలో సరైన చికిత్స కోసం రోగనిర్ధారణ పరీక్షలు తప్పనిసరి అవుతున్నాయి. అటువంటి సమయంలో నాణ్యతతో కూడిన మిషనరీస్ అవసరమవుతాయి కాబట్టి తమ సంస్థ నాణ్యమైన సేవలు అందించ డానికి ఎక్కడా రాజీ పడదని కనెక్ట్ ఇమేజింగ్ అండ్ డయాగ్నస్టిక్ సెంటర్ యాజమాన్యం తెలిపింది.

హైదరాబాద్ లో కనెక్ట్ ఇమేజింగ్ డయాగ్నొస్టిక్ సేవలను అందించడం తమకు దక్కిన గొప్ప అదృష్టం అని, కోవిడ్‌ మహమ్మారి ప్రజలకు ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తత పెంచిందని సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు.

KONNECT IMAGING DIAGNOSITCS

గతరెండు సంవత్సరాల్లో కనెక్ట్ ఇమేజింగ్ అండ్ డయాగ్నస్టిక్ సెంటర్ తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది కేంద్రాలకు పైగా విస్తరించిందని , త్వరలో మరిన్ని రాష్ట్రాల్లో తమసేవలు విస్తరిస్తామని, అందులోభాగంగానే త్వరలో బెంగళూరులో నూతన బ్రాంచ్ ని ప్రారంభిస్తున్నామని సంస్థ యాజమాన్యం తెలిపింది.

కనెక్ట్ ఇమేజింగ్ డయాగ్నస్టిక్ సెంటర్ టీంలోని ప్రతి ఒక్కరూ విలువలు పాటిస్తారు. ఆ విలువను నిలబెట్టుకున్నా మనడానికి తెలంగాణ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ అవార్డ్ కనెక్ట్ ఇమేజింగ్ డయాగ్నస్టిక్ సెంటర్ కు దక్కిందని వారు వెల్లడించారు..