Sun. Dec 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 10,2023: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉత్తమ సీడ్ కంపెనీగా వేద సీడ్స్ కు సీడ్స్ మెన్ అసోసియేషన్ అవార్డు ను అందచేసింది. ఆదివారం విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్ లో సీడ్స్ మెన్ అసోసియేష‌న్ యాన్యువల్ అవార్డ్స్-2023 కార్యక్రమం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా ఉత్త‌మ సీడ్ కంపెనీ (Seed Entrepreneur Award-2023) విభాగంలో వేద సీడ్స్ కంపెనీ ఈ అవార్డును అందుకుంది. వేద సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ డా.పి. చంద్రశేఖర్ గత 30 సంవత్సరాలుగా వ్యవసాయ పరిశోధనలో వారి చేసిన కృషిని అభినందిస్తూ ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్స్ లర్ డా. విష్ణువర్ధన్ రెడ్డి సత్కరించి ఈ అవార్డును అందచేశారు.

ఈ సందర్భంగా.. డా.చంద్రశేఖర్ మాట్లాడుతూ వేద సీడ్స్ ద్వారా నాణ్యమైన, అధిక దిగుబడులను అందించే హైబ్రిడ్ విత్తనాలను రైతుసోదరులకు అందించడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తామని, అవార్డును అందచేసిన సీడ్స్ మెన్ అసోసియేషన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వేద సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తులసి ధర్మచరణ్, తుల‌సి విశ్వంభ‌ర్, వేద సీడ్స్ జనరల్ మేనేజర్ గుడి సతీష్ కుమార్, హెచ్ ఆర్ మేనేజ‌ర్ తోటరంగారావు, జీఎం తాయి శ్రీనివాస‌రావు, పీఆర్ఓ ఇక్కుర్తి వెంకటేష్, గాజుల సాయిరాం, తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!