Sun. Sep 15th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 19,2024:మహిళలను గౌరవించి, రక్షించే వారికి ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు డా హిప్నో పద్మా కమలాకర్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షా బంధన్ సమాజంలో అత్యంత ప్రసిద్ధ పండుగలలో ఒకటిని తెలిపారు. మనుషులు మధ్య సంబంధాన్ని తెలిపే రోజుగా జరుపుకుంటారన్నారు.

ఆంగ్లంలో, ‘ రక్షా బంధన్ ‘ అంటే ‘రక్షణ, బాధ్యత లేదా సంరక్షణ బంధం’ అని అంటారన్నారు. డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్, నవభారత లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ముషీరాబాద్ ఎస్సీ బాలికల హాస్టల్లో స్వాతంత్ర్యం దినోత్సవ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు లియో హిమకర్ ,లయన్ డా.హిప్నో పద్మా కమలాకర్, దుస్తులు ,పుస్తకాలు, పోషకాహారం, బహుమతులు అందజేశారు.

రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఆమె మాట్లాడుతూ ఐక్యత, ప్రేమని తెలిపేదే రాఖీ అన్నారు. ఒకరికొకరు మద్య ఉండే లోతైన ప్రేమ, ప్రేమకు రక్షణ ప్రతీకగా ఇది అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉందన్నారు. ఈ పండుగ తోబుట్టువుల మధ్య బంధాన్ని బలోపేతం చేయడమే కాకుండా కుటుంబంలో ఐక్యత, ప్రేమ, గౌరవాన్ని పెంపొందిస్తుందన్నారు.

ఇది ఏదైనా సంబంధంలో అవసరమైన విధేయత, విశ్వాసం, మద్దతు యొక్క విలువలకు రిమైండర్‌గా పనిచేస్తుందని తెలిపారు. రక్షా బంధన్ హద్దులు దాటి, కుటుంబాలను ఒకచోట చేర్చి, బంధం ప్రాముఖ్యతను పటిష్టం చేస్తుందని చెప్పారు. ఇది ప్రేమ,విడదీయరాని బంధం,వేడుక పాల్గొన్న అందరికీ ఆనందం,ఆనందాన్ని కలిగించే ప్రతిష్టాత్మకమైన సంప్రదాయమన్నారు.

1905లో బెంగాల్ విభజన సమయంలో, రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్‌లోని హిందువులు, ముస్లింల మధ్య ఐక్యత, ప్రేమ భావాన్ని కలిగించడానికి రాఖీ మహోత్సవ్ – సామూహిక రక్షా బంధన్ పండుగను ప్రారంభించారన్నారు. వర్గాల మధ్య చిచ్చు పెట్టే బ్రిటిష్ వారి ప్రయత్నాలకు ప్రతిగా ఆయన ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారని తెలిపారు.

మగపిల్లలు ఎలా ఉంటారు, వారితో ఎలా మెలగాలో చిన్న చిన్న టేక్నిక్స్ ద్వారా హిమకర్ వివరించారు . హాస్టల్లో హెడ్ భానుప్రియ విద్యార్థులు పాల్గొన్నారు.

error: Content is protected !!