Sun. Dec 22nd, 2024
MLA-podem_365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 11,2023: భద్రాచలం పట్టణంలోని కౌసర్ మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ అధ్యక్షులు మొహమ్మద్ ఖాన్ తో కలిసి భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య హాజరయ్యారు.

భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యతోపాటు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరెళ్ళ నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బలుసు సతీష్ లు కూడా పాల్గొన్నారు.

 MLA-podem_365

ఈ కార్యక్రమంలో భద్రాచలం పట్టణ మైనార్టీ అధ్యక్షులు ఆరిఫ్, పట్టణ మైనార్టీ ప్రధాన కార్యదర్శి బాబాజీ ముస్లిం మత పెద్దలు శాసనసభ్యులకు సాధర స్వాగతం పలికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. రానున్న రంజాన్ పండుగకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముస్లిం సోదరులతో ఇఫ్తార్ లో కలిసి పాల్గొన్నారు.

error: Content is protected !!