Thu. Sep 19th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 17,2024:ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా విద్యుత్ బిల్లు చెల్లింపులను సరళీకృతం చేసే ప్రయత్నంలో, NPCI భారత్ బిల్‌పే లిమిటెడ్ (NBBL), ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL), సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణా లిమిటెడ్ (TGSPDCL)నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TGNPDCL)లను భారత్ బిల్ చెల్లింపు వ్యవస్థ (బిబిపిఎస్ ) ప్లాట్‌ఫారమ్‌లో తీసుకువచ్చింది. 

ఈ అభివృద్ధి ద్వారా, రెండు రాష్ట్రాల్లోని వినియోగదారులు ఇప్పుడు వందలాది బ్యాంకులు,ఫిన్‌టెక్ యాప్‌లు,వెబ్‌సైట్‌లతో సహా ఏదైనా బిబిపిఎస్  -ఆధారిత  ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తమ విద్యుత్ బిల్లులను సురక్షితంగా చెల్లించగలరు. 

 NBBL  సీఈఓ  శ్రీమతి నూపూర్ చతుర్వేది మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ నుండి విద్యుత్ పంపిణీ సంస్థలను భారత్ బిల్‌పేలో విలీనం చేయడం ఆర్థిక సమ్మిళితతను పెంచడానికి ఒక ముఖ్యమైన ముందడుగు గా నిలుస్తుంది.

ఈ కార్యక్రమం  మిలియన్ల మంది వినియోగదారులకు తమకు తగిన  ప్లాట్‌ఫారమ్‌ల ఎంపిక చేసుకునే అవకాశం కల్పించటం తో పాటుగా వారి బిల్లులను ఎప్పుడైనా చెల్లించడానికి తగిన సౌకర్యం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 

ఈ బహుళ చెల్లింపు అవకాశాలు  దేశవ్యాప్తంగా డిజిటల్ పరివర్తనను నడపడానికి మా నిబద్ధతను నొక్కి చెబుతాయి  ” అని అన్నారు. 

బిబిపిఎస్  ప్రస్తుతం విద్యుత్, డిటిహెచ్  & బ్రాడ్‌బ్యాండ్, క్రెడిట్ కార్డ్, లోన్ రీపేమెంట్‌లు, ఇన్సూరెన్స్ వంటి 25+ కేటగిరీలలో 22000 కంటే ఎక్కువ లైవ్ బిల్లర్‌లను కలిగి ఉంది. శక్తివంతమైన  ఫిర్యాదుల మద్దతు ప్లాట్‌ఫారమ్‌ కలిగి ఉండటం చేత , కస్టమర్‌లు,బిల్లర్‌లకు అవసరమైన చోట బిబిపిఎస్  వేగవంతంగా  పరిష్కారాలను అందిస్తుంది.

error: Content is protected !!