365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు11,2023: మెగాస్టార్ చిరంజీవి నటించిన “భోళా శంకర్” సినిమా ఈరోజు థియేటర్ లలో విడుదలైంది. చిరంజీవి,తమన్నా భాటియా ప్రధాన పాత్రలను పోషించారు. వీరిద్దరి జోడీ చాలాబాగా కుదిరింది.
చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటించింది. ఆమె పాత్ర మరింత భావోద్వేగాలతో కూడి ఉంటుంది. చిరంజీవి, తమన్నా”సైరా నరసింహా రెడ్డి” సినిమా తర్వాత మరోసారి స్క్రీన్‌ను పంచుకునే అవకాశం వచ్చింది.

ఈ చిత్రం థియేట్రికల్ హక్కుల విలువ రూ.70 కోట్ల (GST మినహా) GSTతో సహా రూ.79 కోట్లు. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రీ-రిలీజ్ బిజినెస్ నైజాం 22 Cr (విలువ) సీడెడ్ 12 Cr (NRA) UA 9.5 Cr (NRA) గుంటూరు 6 Cr (విలువ) తూర్పు 6 Cr (విలువ) కృష్ణా 4.8 Cr (విలువ) వెస్ట్ 4.8 Cr (NRA) Cr AP/TS 68.1 Cr (GST మినహా 60 Cr) ROI 5 Cr OS 6 Cr ప్రపంచవ్యాప్త హక్కులు 79.1 Cr (71 GST మినహా)
ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కాస్త మెరుగ్గా ఉంది. సెకండ్ హాఫ్ లో భోళా భాయ్ ఎలిమెంట్స్ 15 నిమిషాల పాటు ఉన్న సీన్ ప్రేక్షకులతో ఈలలు,చప్పట్లు కొట్టించింది. రెండు పాటలు సూపర్ గా ఉన్నాయి. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ కథ కాస్త పాతదిగా అనిపించినా అద్భుతంగా ఆకట్టుకుంది.
మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ని అనుకరించిన సన్నివేశాలు మరింత ఆసక్తికరంగా అనిపిస్తాయి. మొత్తంమీద, సినిమా మరింత మెరుగ్గా ఉండవచ్చు. ఫ్లాష్‌బ్యాక్ ముగిసిన తర్వాత, ‘జామ్ జామ్’ పాట.. ఒక ఊపు ఊపుతుంది. చిరంజీవి ఎంట్రీ సీన్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. 365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ రేటింగ్ 3.5.