365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగస్టు 27, 2025 : బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌కు సామాన్య ప్రజల నుంచి కంటెస్టెంట్లను ఎంపిక చేసేందుకు నిర్వహిస్తున్న ‘అగ్నిపరీక్ష’ కార్యక్రమం ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లు విచిత్రమైన ప్రవర్తనతో, హాస్యాస్పదమైన టాస్కులతో జడ్జిలకు షాక్ ఇస్తుండగా, తాజాగా ‘మాస్క్ మ్యాన్’ హరీష్ (హృదయ్ మానవ్) వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.

ముఖానికి మాస్క్ ధరించి వచ్చిన హరీష్, జడ్జిలుగా వ్యవహరిస్తున్న అభిజీత్, బిందు మాధవి, నవదీప్‌లను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. “కొన్ని నిమిషాల్లోనే నేనేంటో జడ్జ్ చేయగలరంటే మీరు దేవుళ్లు అయ్యుండాలి” అని ప్రశ్నించాడు. దీంతో జడ్జిలు ఆశ్చర్యపోయారు. బిందు మాధవి వెంటనే స్పందిస్తూ.. “నేను దేవుణ్ణి కాదు” అంటూ సీరియస్ అయ్యారు.
ఈ సందర్భంగా హరీష్, జడ్జిలతో వాదనకు దిగాడు. కోపం వస్తే కొట్టేస్తానని, కానీ దానికి కారణం ఉంటుందని చెప్పాడు. దీనిపై బిందు మాధవి, నవదీప్ తీవ్రంగా స్పందించారు. ‘మీరు నా క్యారెక్టర్‌ను డిసైడ్ చేయకండి’ అని హరీష్ కౌంటర్ ఇచ్చాడు.
అయితే, అతని ధీమా చూసిన జడ్జిలు, హరీష్‌కు రెడ్ కార్డ్ ఇచ్చి పంపేశారు. ఈ పరిణామం బిగ్ బాస్ అగ్నిపరీక్షలో హైలైట్‌గా నిలిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి