365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,నవంబర్ 15,2022: తెలంగాణరాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి తీసుకురావడం తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ఆరోగ్య విప్లవమని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం తెలిపింది.
డీహెచ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ దీన్ దయాల్, రాష్ట్ర కోశాధికారి డాక్టర్ ప్రశాంత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు , డీఎంఈ రమేష్ రెడ్డి లకు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం తరపున రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సోమవారం ఒకేరోజు 1500ఎంబీబీఎస్ అండ్ ఆయుష్ విభాగం వైద్యులను పల్లె దావఖానాలలో ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ స్థాయిలో మరింత సేవలు అందుతాయని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా నూతన వైద్యుల భర్తీకి మెరిట్ లిస్టు విడుదల చేసి వారం రోజులు కావస్తుందని ఆ పోస్టులు కూడా త్వరలో భర్తీ అవుతాయని ప్రకటించడం జరిగిందని, వారి భర్తీతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో సేవలు మరింత మెరుగవుతాయని డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ అన్నారు.
అన్ని జిల్లాలలో మెడికల్ కళాశాలలు ఏర్పాటు కావడంతో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది ఎం.బి.బి.ఎస్ విద్యార్థులుగా రావడానికి అవకాశం కలుగుతుందని ఆయన అన్నారు.