365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, చామరాజ్‌నగర, నవంబర్ 22,2024: కర్ణాటక రాష్ట్రంలోని మైసూరుకు సమీపం లోని చామరాజ్‌నగరలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ విభాగమైన బిర్లా ఓపస్ పెయింట్స్ నాల్గవ ప్లాంట్‌ను ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్, కుమార్ మంగళం బిర్లా ప్రారంభించారు. పూర్తిగా ఆటోమేటెడ్, ఇంటిగ్రేటెడ్ పెయింట్ ప్లాంట్ నేడు తన వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది. ఇది కంపెనీ తయారీ సామర్థ్యాన్ని ఏడాదికి 866 మిలియన్ లీటర్లకు (ఎంఎల్ పిఏ) వృద్ధి చేయగా, బిర్లా ఓపస్ పెయింట్స్ సంస్థాపిత సామర్థ్యంతో 2వ అతిపెద్ద డెకరేటివ్ పెయింట్స్ తయారీదారుగా అవతరించింది.
ఈ సందర్భంలో ఆదిత్య బిర్లా గ్రూప్చైర్మన్కుమార్ మంగళం బిర్లా మాట్లాడుతూ, “మా పెయింట్స్ వ్యాపారం ఒక కొత్త భారతదేశం, విశ్వాసం, ఆకాంక్ష కలిగిన భారతదేశం గురించి మాట్లాడుతుంది. ధైర్యమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన భారతదేశం ఈ స్ఫూర్తితో మా ఆకాంక్షలు ప్రతిబింబిస్తాయి.
ఈ ఏడాది ప్రారంభంలో బిర్లా ఓపస్ పెయింట్స్ ప్రారంభించడం భారతీయ పెయింట్స్ పరిశ్రమలో కీలకమైన క్షణం కాగా, మేము పరిశ్రమను పునర్నిర్వచించాలను కుంటు న్నాము. వ్యాపారంలో ఇప్పటివరకు ప్రభావవంతమైన ప్రయాణంతో ప్రణాళికకు అనుగుణంగా పురోగమిస్తోంది. పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించిన మొదటి 3ఏళ్లలో రూ.10వేల కోట్ల ఆదాయ లక్ష్యాన్ని చేరుకోవడానికి సరైన మార్గంలో వెళుతున్నాము’’ అని తెలిపారు.
‘‘దక్షిణాదిన వృద్ధి చెందుతున్న అవసరాలను ప్రత్యేకంగా తీర్చడానికి, చామరాజ్ నగరలోని మా నాల్గవ అత్యాధునిక తయారీ కేంద్రం మా వృద్ధి వ్యూహానికి మద్దతు ఇస్తుంది. ఈ కొత్త సదుపాయం వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు, సేవలను అందించడంలో మాకు సహాయం చేస్తుంది. ఇది డెకరేటివ్ పెయింట్ పరిశ్రమలో అగ్రగామిగా ఎదగడానికి మా అచంచలమైన నిబద్ధతను నొక్కి చెబుతుంది’’ అని ధీమా వ్యక్తం చేశారు.
చామరాజనగర ప్లాంట్230 ఎంఎల్ పిఏ సామర్థ్యం కలిగిన వాటర్ బేస్డ్ పెయింట్స్, ఎనామెల్ పెయింట్స్, వుడ్ ఫినిష్ పెయింట్స్ ఉత్పత్తి చేస్తుంది. వాటర్ బేస్డ్ పెయింట్‌లు ప్రత్యేకమైన పాలిమర్ సింథసిస్ ప్రక్రియతో అంతర్గతంగా తయారు చేసిన అధునాతన ఎమల్షన్‌లను కీలక ముడి పదార్థంగా ఉపయోగిస్తాయి.
మల్టీ స్టెయిన్ రెసిస్టెన్స్, అత్యుత్తమ ధూళి నిరోధకత, క్రాక్ బ్రిడ్జ్-ఎబిలిటీ, అధిక స్క్రబ్ రెసిస్టెన్స్ వంటిబిర్లా ఓపస్ లగ్జరీ ఉత్పత్తులతో పెయింట్స్ వినూత్న పెయింట్ ఫీచర్లను అందించడంలో కంపెనీకి సహాయపడుతుంది.
ద్రావకం ఆధారిత పెయింట్‌లు అధిక తుప్పు నిరోధకత, మెరుగైన మన్నిక, వేగవంతమైన ఆరబెట్టడం, ఉన్నతమైన గ్లోస్ కోసం సున్నితమైన డిజైనర్ మాలిక్యూల్స్‌తో ఇన్‌హౌస్ రెసిన్‌లను ఉపయోగిస్తాయి. ప్లాంట్ జీరో లిక్విడ్ డిశ్చార్జ్‌తో పూర్తిగా నిలకడగా ఉంది. మెరుపు వేగంతో సప్లయ్ చెయిన్‌ను నిర్వహించేందుకు 4వ తరం తయారీ సాంకేతికతను కలిగి ఉంది. జీరో లోపాలు, ఎండ్ టు ఎండ్ ప్రోడక్ట్ ట్రేస్‌బిలిటీ అనేది ఇక్కడ మొదటి ఫీచర్‌గా ఉంది.
బిర్లా ఓపస్ పెయింట్స్ గతంలో రూ.10,000 కోట్ల ముందస్తు పెట్టుబడితో మొత్తం 1,332ఎంఎల్ పిఏ సామర్థ్యంతో వ్యూహాత్మకంగా ఉన్న ఆరు తయారీ పరిశ్రమలను నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందించింది. పెయింట్స్ వ్యాపారం ఇప్పటికే మొత్తం క్యాపెక్స్ రూ.8,470 కోట్లు (మొత్తం ప్రాజెక్ట్ ఖర్చులలో 85%). ప్రస్తుతం, నాలుగు ప్లాంట్లు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా 866 ఎంఎల్ పిఏఉత్పత్తి అవుతుంది. మిగిలిన రెండింటిలో, పుణె సమీపంలోని మహద్ ప్లాంట్ ట్రయల్ ప్రొడక్షన్‌లోకి ప్రవేశించగా, కోల్‌కతా సమీపంలోని ఖరగ్‌పూర్ ప్లాంట్ ప్రణాళికాబద్ధంగా పురోగమిస్తోంది.
ఆదిత్య బిర్లా గ్రూప్ డైరెక్టర్ హిమాన్షు కపానియా మాట్లాడుతూ, ‘‘బిర్లా ఓపస్ పెయింట్స్ తన వృద్ధి ప్రయాణంలో భాగంగా వేగంగా పురోగతిని కొనసాగిస్తోంది. మా 6 అత్యాధునిక, పూర్తి ఆటోమేటెడ్ తయారీ ప్లాంట్‌లలో 4 ఇప్పుడు పనిచేస్తున్నాయి. పానిపట్, లూథియానా, చెయ్యార్ అనంతరం చామరాజ్‌నగరలోని మా నాల్గవ ప్లాంట్ ప్రారంభోత్సవం ఒక కీలక మైలురాయిని సూచిస్తుంది. ఇది పురోగతికి మా నిబద్ధతను బలపరుస్తుంది’’ అని వివరించారు.
ప్రారంభించిన సమయంలో, బిర్లా ఓపస్ పెయింట్స్ నీటి ఆధారిత పెయింట్‌లు, ఎనామెల్ పెయింట్, వుడ్ ఫినిష్‌లు, వాటర్‌ఫ్రూఫింగ్, వాల్‌పేపర్‌లలో 145+ ఉత్పత్తులు,1,200 SKUలతో విశాలమైన ఉత్పత్తి శ్రేణిని అందించడానికి కట్టుబడి ఉంది. సెప్టెంబరు 2024చివరికి, కంపెనీ ఇప్పటికే 900 ఎస్ కెయులతో ప్రణాళికాబద్ధమైన 145+ ఉత్పత్తుల్లో 129 ఉత్పత్తులను అందిస్తోంది.
చామరాజ్‌నగర ప్లాంట్‌ను ప్రారంభించడం ద్వారా బిర్లా ఓపస్ పెయింట్స్ తన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను ఇండియన్ పియు వుడ్ ఫినిష్, ప్రత్యేక ఫ్యాక్టరీ-నిర్మిత షేడ్స్ ఆఫ్ ఎనామెల్స్‌తో పాటు మార్కెట్‌కు మెరుగైన సేవలందించేందుకు లాజిస్టిక్స్ ధరను తగ్గించడంలో సహాయపడుతుంది. వ్యాపారం నెల వృద్ధిపై బలమైన నెలను నమోదు చేస్తుండడంతో ఉత్పత్తి నాణ్యత ఇప్పటికే వినియోగదారులు,పెయింటర్‌ల నుంచి మంచి అభిప్రాయాన్ని దక్కించుకుంది.
బిర్లా ఓపస్ పెయింట్స్ సీఈఓ రక్షిత్ హర్‌గేవ్ మాట్లాడుతూ, “అత్యాధునిక ఆర్ అండ్ డి, ఈఎస్‌జీ కార్యక్రమాలు, స్మార్ట్ ఫ్యాక్టరీ టెక్నాలజీకి మా అంకితభావం, మొత్తం పర్యావర వ్యవస్థకోసం విభిన్నమైన ఉత్పత్తుల లక్షణాలతో దేశంలో అత్యుత్తమ నాణ్యత కలిగిన డెకరేటివ్ పెయింట్‌లను అందజేస్తోంది. మా నాల్గవ, పూర్తి ఆటోమేటెడ్ ఫ్యాక్టరీని ప్రారంభించడం భారతదేశంలో విజయవంతమైన పెయింట్స్ వ్యాపారాన్ని నిర్మించాలనే మా నిబద్ధతకు మరింత బలం చేకూరుస్తుంది’’ అని తెలిపారు.
బిర్లా ఓపస్ పెయింట్స్ నేడు తన ఫ్రాంఛైజీ నేతృత్వంలోని పెయింటింగ్ సర్వీసెస్ – పెయింట్‌క్రాఫ్ట్ పార్టనర్‌ను తన డైరెక్ట్ పెయింటింగ్ సేవలకు అనుబంధంగా ప్రారంభించామని వెల్లడించింది.