365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబయి, మార్చి 7,2025: అలంకరణ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ, ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ బిర్లా ఓపస్ పెయింట్స్, గురుగ్రామ్‌లో తన మొట్టమొదటి బిర్లా ఓపస్ పెయింట్ స్టూడియోను ప్రారంభించింది. వినియోగదారులకు పెయింట్ ఎంపికపై ఓ నూతన అనుభూతిని అందించేందుకు వీలుగా ఈ స్టూడియోను రూపొందించింది.
ఈ స్టూడియోలో 170కు పైగా పెయింటింగ్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. వినియోగదారుల కోసం ప్రత్యేకమైన వాల్‌పేపర్‌లు, డిజైనర్ ఫినిషింగ్‌లు, విభిన్నమైన షేడ్స్ అందుబాటులో ఉన్నాయి.
Read this also… Birla Opus Paints Unveils Its First-Ever Paint Studio, Redefining the Painting Experience
Read this also… Marico Innovation Foundation Celebrates Trailblazing Innovators at Indian Innovation Icons 2025
ఇది కూడా చదవండి…రూ. 700 కోట్ల ఐపీవో కోసం సెబీకి డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసిన ఎక్సెల్‌సాఫ్ట్ టెక్నాలజీస్
కంపెనీ వృద్ధి వ్యూహంలో భాగంగా త్వరలో న్యూఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, అహ్మదాబాద్, సూరత్, జైపూర్ తదితర నగరాల్లో కూడా ఇలాంటి అనుభవ కేంద్రాలను ప్రారంభించనుంది.
ఈ సందర్భంగా బిర్లా ఓపస్ పెయింట్స్ సీఈఓ రక్షిత్ హర్గవే మాట్లాడుతూ, “ఇండియాలో పెయింటింగ్ అనుభవాన్ని పూర్తిగా కొత్తదనంతో అందించాలనే లక్ష్యంతో ఈ పెయింట్ స్టూడియోను ప్రారంభించాం.

పెయింటింగ్ అంటే కేవలం గోడలకు రంగు అద్దడం మాత్రమే కాదు, అది ప్రతి ఇంటి ప్రత్యేకతను ప్రతిబింబించే కళగా ఉండాలి. అందుకే వినియోగదారులకు ఇంటీరియర్ డిజైనింగ్ ప్రపంచాన్ని దగ్గర చేయాలని భావిస్తున్నాం” అని తెలిపారు.
ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్ల కోసం ప్రత్యేక వసతులు
ఈ స్టూడియో ప్రత్యేకంగా ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్లకు వర్క్‌స్పేస్, నమూనాలు, నిపుణుల మద్దతు వంటి అనేక వనరులను అందిస్తుంది. దీంతో డిజైనింగ్ ప్రొఫెషనల్స్ తమ ప్రాజెక్టులకు తగిన విధంగా రంగులను ఎంపిక చేసుకునే అవకాశం లభిస్తుంది.
Read this also… Excelsoft Technologies Files DRHP with SEBI for Rs.700 Crore IPO..
Read this also… Women Investors Embrace Mutual Funds: Key Insights from PhonePe Wealth
దేశీయ సంస్కృతి ప్రతిబింబించే షేడ్స్
ప్రతి పెయింట్ స్టూడియో స్థానిక సంస్కృతి, వారసత్వం, వాస్తుశిల్పం నుంచి ప్రేరణ పొందిన ఎక్స్క్లూజివ్ షేడ్స్ను అందుబాటులో ఉంచనుంది. దీంతో వినియోగదారులకు వారి గృహాల అలంకరణలో కొత్తదనం తేవడానికి ఈ స్టూడియోలు ఓ నూతన గమ్యస్థానంగా నిలువనున్నాయి.

స్టోర్ చిరునామా:
బిర్లా ఓపస్, SCO-306, సెక్టార్-29, గురుగ్రామ్- 122001
ఈ కొత్త ఆవిష్కరణ ద్వారా బిర్లా ఓపస్ పెయింట్స్, దేశంలో రెండవ అతిపెద్ద అలంకరణ పెయింట్స్ బ్రాండ్‌గా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకుంది.