365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ జనవరి 25,2023: స్కూల్ సిలబస్‌లో వేదాలు,పురాణాలను ప్రవేశపెట్టాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీసుకున్న నిర్ణయం పట్ల రాజేంద్రనగర్ నియోజకవర్గం సీనియర్ బీజేపీ నాయకులు బుక్క వేణుగోపాల్ హర్షం వ్యక్తం చేశారు.
పాఠ్యాంశాలుగా వేదాలు, పురాణాలు ప్రవేశపెట్టడం వల్ల సమాజానికి మంచి వ్యక్తిత్వం కలిగిన పిల్లలను అందించవచ్చని ఆయన తెలిపారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పాశ్చాత్య పోకడల బారిన పడిన పిల్లలకు సంస్కృతి ,సంప్రదాయాలు, విలువలను అందించడం సాధ్యమవుతుందని రాజేంద్రనగర్ నియోజకవర్గం సీనియర్ బీజేపీ నాయకులు బుక్క వేణుగోపాల్ పేర్కొన్నారు.
పాఠశాల సిలబస్‌లో మహాభారతం, రామాయణం, భగవద్గీత, వేదాలు మొదలైన వాటిని ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా బుక్కా వేణుగోపాల్ కోరారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఇలా చేస్తే ఆయా గ్రంథాలు పిల్లలకు సంస్కృతి , విలువలను అందించడమే కాకుండా వారిని సంపూర్ణమైన పౌరులుగా తీర్చి దిద్దవచ్చని ఆయన తెలిపారు.