Thu. Dec 5th, 2024
Bukka-venugopal-BJP

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,అక్టోబర్ 22,2022: కేసీఆర్ భారీ ప్యాకేజీ మీకు అంతగా నచ్చినట్లయితే నాకు ప్రజలకు సేవ చేసే భాగ్యం లేదని తప్పుకోవాలే గానీ,బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా బీసీలకు పెద్దపీట వేస్తున్న భారతీయ జనతా పార్టీపై నింద వేయడం మీ రాజకీయ అనుభవానికి, మీ వయసుకు ఏమాత్రం సరికాదని రాజేంద్రనగర్ నియోజికవర్గం బిజెపి నాయకులు బుక్క వేణుగోపాల్ అన్నారు.

బీజేపీలో మీకు ప్రాధాన్యత కల్పించడం లేదన్నకారణం చూపి టీఆర్ ఎస్ లోచేరిన స్వామి గౌడ్ ను యావత్ తెలంగాణ ప్రజలు అమ్ముడుపోయిన వ్యక్తిగా పరిగణించి నవ్వుకుంటున్నారు. అనతి కాలంలోనే మీకు పార్టీ చేరికల కమిటీ సభ్యులుగా, ఓక నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతలు ఇవ్వడమేకాకుండాప్రతి ముఖ్య సమావేశాలో మీకంటూ ప్రత్యేక స్థానం కల్పించిన పార్టీ ఏ విధంగా మీకు పార్టీలో గుర్తింపు కల్పించలేదో బహిరంగ చర్చకు రావాలని బుక్క వేణుగోపాల్ సవాల్ విసిరారు.

Bukka-venugopal-BJP

మిమల్ని మంచి బీసీ నాయకుడిగా గుర్తించి మీరు పార్టీలో చేరినప్పటి నుంచి జాతీయ,రాష్ట్ర అగ్ర నాయకులు సైతం ప్రత్యేకంగా మీ ఇంటికి వచ్చి మరి ఎంతో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కానీ ఈరోజు కనీసం అగ్ర వర్ణాలకు సైతం ప్రగతి భవన్ లో అనుమతి దొరకనివ్వని దొర మోచేతి నీళ్ళు తాగడానికి వెళ్ళారా?? అని విమర్శించారు.

మిరు వెళ్ళినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం జరిగదని, కానీ సాధారణ కార్యకర్తగా మొదలుకొని అంచలంచలుగా కష్టపడుతూ ఎదిగిన ఒక బీసీ బిడ్డ బండి సంజయ్ గారిని ప్రాధాన్యత కల్పించడం లేరని మీరన్న వ్యాఖ్యలను నేను ఒక బీసీ బిడ్డగా తీవ్రంగా ఖండిస్తున్నాను అని బుక్కవేణుగోపాల్ పేర్కొన్నారు.

Bukka-venugopal-BJP

వెంటనే భేషరతుగా వారికి బహిరంగ క్షమాపణ చెప్పి ఎలాగో మీకు ప్రజలకు సేవ చేసే ఓపిక లేదు. కాబట్టి మొత్తానికి రాజకీయ సన్యాసం స్వీకరించిన ఇంటికే పరిమితమై వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడాన్ని చూసి తరించాలని బుక్కవేణుగోపాల్ తెలిపారు.

భారతీయ జనతా పార్టీ ఎంతో విలువలతో కూడిన అతిపెద్ద రాజకీయ పార్టీ.. కాబట్టే నాయకులు ఎందరో వస్తారు..వెళ్తారు.. కానీ బూత్ స్థాయి కార్యకర్తలే పార్టీకి అండదండ అని బుక్కవేణుగోపాల్ పేర్కొన్నారు.

error: Content is protected !!