365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మార్చి 19,2023: “అప్పుడు ఇంటర్ బోర్డు, ఇప్పుడు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్” కొలవుల కోసం స్వరాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్న విద్యార్థుల భవిష్యత్ను అగమ్యగోచరంగా మార్చిన కెసిఆర్, కేటిఆర్, అధికారులందరూ వెంటనే రాజీనామా చేయాలని రాజేంద్రనగర్ నియోజకవర్గం బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ అన్నారు.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ లో అంబెడ్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు.
ఈ దీక్షలో పాల్గొన్న బుక్క వేణుగోపాల్ మాట్లాడుతూ ” పేపర్ లీక్ చేసిన బిఆర్ఎస్ వాళ్లని వదిలేసి, తెలంగాణ యువకుల న్యాయం కోసం నిరసన చేస్తున్న బీజేపి, బీజేవైఎం నాయకులపై నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా..? అని సర్కారు ను నిలదీశారు.
విద్యార్థులకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతూనే ఉంటుందని బుక్క వేణుగోపాల్ పేర్కొన్నారు.