365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,శంషాబాద్, నవంబర్ 20, 2022: ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి హేయనీయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతీయ జనతా పార్టీ నేతల ఇళ్లపై దాడులు ఎక్కువయ్యాయని ఆయన పేర్కొన్నారు. బంజారాహిల్స్ లోని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టిఆర్ఎస్ నేతలు చేసిన దాడిని బుక్కా వేణుగోపాల్ తీవ్రంగా ఖండించారు.

తెలంగాణ రాష్ట్రంలో బీసీ ల ఎదుగుదలను సహించలేక తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు, కేటీఆర్ ల ప్రోత్సాహంతోనే ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి జరిగిందని ఆరోపించారు. దొర ఆగడాలను, దొర రాజ్యాన్ని బొంద పెట్టే వరకు ప్రజలు ఊరుకోరనీ, ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి చేయించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ లు బేషరుతుగా క్షమాపణ చెప్పాలని బుక్కా వేణుగోపాల్ డిమాండ్ చేశారు.