365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 19,2024: ఢిల్లీలో నిర్వహించిన ధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి ఎప్పుడూ స్పష్టంగా కనిపిస్తుందని ఆమె ఆరోపించారు.
ఎన్నికల్లో రెండుసార్లు బాబా సాహెబ్ అంబేద్కర్ ఓటమిని నిర్ధారించిన కాంగ్రెస్, ఆయనను పార్లమెంటులోకి రానివ్వని పార్టీ, దేశ అత్యంత గౌరవనీయమైన భారతరత్న పురస్కారాన్ని ఆయనకు అందించని పార్టీగా నిలిచిందని పురంధేశ్వరి వ్యాఖ్యానించారు.
రోజు అంబేద్కర్ జీకి తప్పుడు గౌరవం ఇవ్వడమంటే అది ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచినట్టేనని ఆమె పేర్కొన్నారు.
బాబా సాహెబ్ అంబేద్కర్‌కు భారతరత్న ప్రదానం చేసిన ఘనత బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానిదే. ఆయన జీవితానికి సంబంధించిన ఐదు ప్రదేశాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేసింది కూడా బీజేపీనే.
ఏకీకృత కోడ్ బిల్లును అమలు చేయడం ద్వారా అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది.
“బాబా సాహెబ్‌కి నిజమైన గౌరవం ఇచ్చేది ఎప్పటికీ బీజేపీయే” అని పురంధేశ్వరి ధృడంగా తెలిపారు.