365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 17,2025: బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్, భారతదేశంలో ఫ్యాషన్­కు అత్యంత నిర్దుష్టమైన ఈ స్వరం 2025లో మరొక మహత్తరమైన సంచికతో పునఃప్రవేశం చేస్తోంది. ఇక్కడ ఫ్యాషన్, సృజనాత్మకత,సాంస్కృతిక సమాగమం జరిగి, ‘ద వన్ ఎండ్ ఓన్లీ’ వేదికను సృష్టిస్తుంది. ఫ్యాషన్ తదుపరి స్థాయికి ఇది రంగాన్ని సిద్ధం చేస్తుంది.

ట్రెండ్స్ తరచూ మారుతూ పోయే ఈ ప్రపంచంలో, ఈ ఫ్యాషన్ టూర్ ఒక సాహసోపేతమైన మార్గాన్ని అనుసరిస్తూ, ఫ్యాషన్­ను ముందుకు తీసుకుపోయేందుకు దిశానిర్దేశం చేయటాన్ని మళ్ళీ కల్పన చేసి, ‘ఫ్యాషన్స్ నెక్స్ మూవ్’ను పునర్విర్వచిస్తుంది.

ఇది కేవలం ఒక థీమ్ మాత్రమే కాదు – ఇది ఒక ప్రకటన, ఫ్యాషన్ తదుపరి అధ్యాయం ఏదో ఒక రన్­వే మీద మొదలవ్వదనే ఒక నిర్దుష్టమైన వాంగ్మూలం; బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ వేదికల పై ఇది ప్రారంభం అవుతుంది.

ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (FDCI)తో మరోసారి తన శక్తిని ఏకం చేస్తూ, ఫ్యాషన్ టూర్ భారతదేశపు అగ్రశ్రేణి డిజైనర్లు మరియు ప్రఖ్యాతి చెందిన స్టైల్ ఐకన్లను, ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనాన్ని మునుపెన్నడూ లేని విధంగా సంచలనం సృష్టించేట్లు కలిపి ముందుకు తీసుకువస్తుంది.

షాహిద్ కపూర్,తమన్నా భాటియాలతో కలిసి డిజైనర్లు ఫాల్గుణీ ,షేన్ పీకాక్­లు పాల్గొని ‘ద ఫ్యూచర్­వెర్స్ ఆఫ్ ఫ్యాషన్’తో గుర్గావ్­లో ఫ్యాషన్ అనుభవాల భవిష్యత్తును అనావృతం చేస్తూ ఈ టూర్ ఒక దిశను నిర్దేశిస్తుంది.

ఒక రన్­­వే ఎలా ఉండాలో – ఒక సమ్మోహనాత్మకమైన విధంగా, చూపులను ఆకట్టుకునే విధంగా, సాంకేతికపరిజ్ఞానం, ఖరీదైన ఫ్యాషన్ దుస్తుల మధ్య వ్యత్యాసాన్ని తొలగించే విధంగా, ఫ్యాషన్­ను అనుభవించే డైమెన్షన్లను మార్చే విధంగా – పునర్నిర్వచిస్తుంది.

ఈ టూర్ ఆ తర్వాత జైపూర్­కు ‘హై ఆక్టేన్ కొచూర్’తో గేర్­ను మార్చి ముందుకు సాగుతుంది. ఇక్కడ డిజైనర్లు అభిషేక్ పట్నీ,నమ్రతా జోషిపురా­, మోటర్­స్పోర్ట్స్ రంగంలోని వేగాన్ని, శక్తిని, ఖచ్ఛితత్వాన్ని ఫ్యాషన్­ రన్­వే వద్దకు తీసుకువచ్చి, ఒక అంతర్జాతీయ స్టైల్ కొత్త భాషను నిర్వచిస్తారు. 2021 విశ్వసుందరి హర్నాజ్ సంధూ శైలిని, ర్యాపర్ రఫ్తార్ యొక్క అపారమైన శక్తిని ప్రదర్శించే ఈ చాప్టర్, పూర్తి స్థాయిలో – ఉత్తేజభరితమైన, సాహసోపేతమైన, అసామాన్యమైన గ్లామర్­ను – కలిగి ఉండే ఫ్యాషన్­ను తప్పక అందిస్తుంది.

కోల్­కతాలోని ఫినాలేలో ‘బ్రేకింగ్ ద మౌల్డ్స్ ఆఫ్ ఫ్యాషన్ క్రాఫ్ట్’లో కనిపిస్తుంది. ఇందులో చారిత్రాత్మక డిజైనర్ అనామికా ఖన్నా, ఆమెతో పాటు ఇషాన్ ఖట్టర్­లు మళ్ళీ పాల్గొంటారు. ఈ చాప్టర్, హస్తకళ యొక్క అంతర్లీనమైన శక్తి మీద కాంతిపుంజంలా మెరుస్తూ, సమకాలీన దృక్పథంతో కలిపే వారధిని నిర్మించి, ప్రేక్షకులకు అభినందించేందుకు కేవలం ఫ్యాషన్­ను మాత్రమే కాక, ఆస్వాదించేందుకు హస్తకళను కూడా అందిస్తుంది.

దేబశ్రీ దాస్­గుప్తా, CMO, పెర్నాడ్ రిచర్డ్ ఇండియా, ఇలా అన్నారు, “బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్, భారతదేశపు ఫ్యాషన్ అత్యంత చారిత్రాత్మక వేదిక. Guided by our ‘ద వన్ అండ్ ఓన్లీ’ అనే మా ఆశయసాధన కోసం కృషి చేస్తూ మేము, భారతదేశపు అత్యంత నిపుణులైన డీజైనర్లు, FDCIల సహకారంతో, ఫ్యాషన్,స్టైల్ ల ఆవిర్భావానికి రూపకల్పన చేసే కొత్త కొలమానాలను నిర్దేశించటం కొనసాగిస్తాము.

‘ఫ్యాషన్స్ నెక్స్ట్ మూవ్’తో మేము, ఫ్యాషన్ భవిష్యత్తును ప్రదర్శించే సాహసోపేతమైన దిశలో, స్టైల్­తో దిశానిర్దేశం చేయటమంటే ఏమిటో, సృజనాత్మకత, సంస్కృతి మరియు ఆవిష్కరణలు మమేకమయ్యే ఒక భవిష్యత్తును కూర్చటం అంటే ఏమిటో తెలిపే దిశలో ముందడుగు వేస్తున్నాము.

తదుపరి తరపు వినియోగదారులకు స్ఫూర్తిగా నిలిచే ప్రగతిపథంలో నడిచే కథనాన్ని రూపొందించటం పట్ల, మా ఐకానిక్,పురోగమనాత్మక ప్రపంచంలోకి వారిని ఆహ్వానించటం పట్ల మేము నమ్మకాన్ని కలిగి ఉన్నాము.”

సునీల్ సేఠీ, ఛెయిర్మన్, FDCI, ఇలా అన్నారు, “బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్­తో తన సహకారబాగస్వామ్యం FDCI కి ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఫ్యాషన్ ప్రపంచంలో రెండు శక్తులను ఇది ముందుకు తీసుకువస్తోంది.

తద్వారా భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే మా నిబద్ధతను ఇది పెంపొందిస్తుంది. ఈ సంచిక, సృజనాత్మకత, సంస్కృతులను వేడుకగా జరుపుకునే వైవిధ్యభరితమైన డిజైన్ పరికల్పనలను ఒక తాటిపైకి తెచ్చి, భారతదేశపు ప్యాషన్ భవిష్యత్తుకు వడిని నిర్ధారిస్తుంది.”