365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 26, 2024:ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్ పరిధిలోని వ్యవసాయ కళాశాల, జాతీయ సేవా పథకం విభాగం, రోటరీ క్లబ్,M.N.J కాన్సర్ ఆసుపత్రి వారు సంయుక్తంగా ఈరోజు యూనివర్సిటీ హెల్త్ సెంటర్ లో రక్తదాన శిబిరంను నిర్వహించారు.
ఈ ప్రారంభ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ పి. రఘురామి రెడ్డి రక్తదానం ప్రాముఖ్యతను విద్యార్థిని, విద్యార్థులకు తెలియజేస్తూ వారిని ఉద్దేశిస్తూ అందరు పెద్దలు, పిల్లలు చేసే రక్తదానం ద్వారా ఎందరికో పునర్జన్మను ప్రసాదించినవారౌతారని వారిని ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో డి.ఎస్.ఏ డాక్టర్ J. సత్యనారాయణ, రోటరీ క్లబ్ చైర్మన్ డాక్టర్ M. రామ్ ప్రసాద్, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్ జగదీశ్వర్, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సి. నరేంద్రరెడ్డి, డీన్ ఆఫ్ పిజి స్టడీస్ డాక్టర్ వి. అనిత, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ జమునరాణి, డీన్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ అరుణ, M.N.J క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ సి. పద్మవేణి, ఆఫీసర్ ఇన్చార్జ్ హెల్త్ సెంటర్, ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్, బోధన,బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా 87 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు.