365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, శ్రీకాకుళం సెప్టెంబర్ 2, 2020: బారువ యువత శ్రీ పవనపుత్ర యువజన సేవా సంఘం (పవనపుత్ర బ్లడ్ డోనర్స్) ఆధ్వర్యంలో శ్రీకాకుళం న్యూ బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో సోంపేట మండలం బారువా గ్రామం లో రక్తదాన శిభిరం నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం లో బారువ పరిసర ప్రాంతాల యువత పెద్దఎత్తున స్వచ్చందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరం ద్వారా మొత్తం 46యూనిట్ల రక్తాన్ని సేకరించారు. రక్తదాన శిబిరం నిర్వాహకులు దున్న నవీన్ కుమార్ మాట్లాడుతూ “యువత రక్తదానం చెయ్యడానికి ముందుకు రావాలని…రక్తదానం ప్రాణదానంతో సమానం అని అన్నారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్నా వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు” తెలిపారు.
ఆనలుగురు సేవా సంస్థ ఆర్గనైజర్ మిన్నారావు మాట్లాడుతూ “కరోనా సమయం లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి యువత రక్తదానం చేసేవిధంగా ప్రోత్సహించిన బారువ యువతకు పెద్దలకు ధన్యవాదాలు” తెలిపారు. పవనపుత్ర బ్లడ్ డోనర్స్ ఫౌండర్ మజ్జి భాస్కరరావు మాట్లాడుతూ “కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు సరైన సమయానికి రక్తం అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు.ఈ సమయం లో బారువ యువత ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందించదగిన విషయమని “అన్నారు. అలాగే సమాజంలో యువత రక్తదానం చెయ్యడం ఒక బాధ్యతను తీసుకోవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బారువ మాజీ సర్పంచ్ ఎర్ర తారకేశ్వరరావు, దున్న సత్యం , గుప్పి చిరంజీవి, బారువ పూర్వవిద్యార్థి సంఘం అధ్యక్షులు బల్లాన తిరుమలరావు , దున్న శ్రీను, తెప్పల కృష్ణారావు, సతీష్ సాహు (గోల్డ్ షాప్ ), ఆర్ ఎంపీ సత్యరాజ్ , పవనపుత్ర బ్లడ్ డోనర్స్ అడ్మిన్ టీం ఇప్పిలి ప్రదీప్, లండ ఈశ్వరరావు, ఆనలుగురు సభ్యుడు సాన ఈశ్వరరావు, ,బారువ యువత సుమన్ సాహు టీచర్, కర్రీ శివాజీ, ఎర్ర లోకనాథం, పొందార ధర్మ,పైల వంశీ, గోరకల అఖిల్ తదితరులు పాల్గొన్నారు.