365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,ఇండియా, ఫిబ్రవరి 9,2022: భారతదేశపు వైమానిక వలయం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రంగాల్లో ఒకటిగా ఉంది. ఇది 2013-14వ ఆర్థిక సంవత్సరంలో 169 మిలియన్ల నుంచి 2019-20 నాటికి 341 మిలియన్ ప్రజల ప్రయాణాలతో రెట్టింపు కాగా, ఏటా 10% మేర ప్రగతిని దాఖలు చేసింది.గత రెండు దశాబ్దాల్లో తక్కువ-టిక్కెట్ ఛార్జీలను కలిగిన విమానయాన సంస్థలు వరుసగా మార్కెట్టులో అడుగు పెట్టాయి లేదా దూర ప్రాంతాల్లోని నగరాలకు ఉన్నత ప్రాంతీయ ప్రాంతీయ కనెక్టివిటీ,ప్రాంతీయ విమాన ప్రయాణాల ట్రాఫిక్ వృద్ధి చెందగా,భారతదేశపు విమానరంగ రూపురేఖలను మార్చివేయగా, ప్రపంచంలో మూడవ అతి పెద్ద స్థానిక వైమానిక మార్కెట్‌గా నిలిచింది.బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగళూరు విమానాశ్రయం),భారతదేశంలో అత్యంత కార్యకలాపాలు జరిగే మూడవ అతి పెద్ద విమానాశ్రయం కాగా,
భారతదేశపు విమానయాన రంగం ప్రగతికి గమనార్హమైన మద్ధతు ఇస్తుండగా, నాన్-మెట్రో నగరాలకు అనుసంధానాన్ని అందించడం ద్వారా ప్రజలు విమాన ప్రయాణం చేసేందుకు, ప్రాంతీయ ఆర్థిక ప్రగతికి తన వంతు పాత్రను పోషిస్తోంది. ఈ ప్రక్రియలో బెంగళూరు విమానాశ్రయం దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ట్రాన్స్‌ఫర్ హబ్‌గా వృద్ధి చెందింది.ప్రస్తుతం బెంగళూరు విమానాశ్రయం 74 స్థానిక గమ్యస్థానాలకు (క్యాలెండర్ ఏడాది 2021)సేవలు అందిసతుండగా, విమాన ప్రయాణ సేవలు ప్రారంభించిన రోజు నుంచి కొవిడ్ పరిస్థితులు ప్రారంభమయ్యేంత వరకు 54 మార్గాలకు సేవలు అందించడాన్ని పోల్చితే,అత్యంత వృద్ధితో ,దక్షిణ భారతదేశంలోని విమానాశ్రయాల్లో అత్యంత ఎక్కువ సంఖ్యను కలిగి ఉంది.
కొత్తగా అనుసంధానం అయిన వాటిలో నాన్-మెట్రో నగరాలు ఉన్నాయి,నాన్-మెట్రో మార్గాలకు విమానాలు 58% (కొవిడ్‌కు ముందు) నుంచి 2021 ఏడాదిలో 63%కు వృద్ధి చెందాయి. అంతే కాకుండా 2021లో 1వ త్రైమాసికం నుంచి 4వ త్రైమాసికం మధ్య నాన్-మెట్రో మార్గాలకు ట్రాఫిక్ 27% వృద్ధి చెందడం దృఢమైన డిమాండ్‌ను సూచిస్తోంది.2021వ ఏడాదిలో బెంగళూరు విమానాశ్రయంలో ట్రాన్స్‌ఫర్ ట్రాఫిక్ ప్రయాణికులు సుమారు 19% మేర ఉండగా, కొవిడ్ ముందస్తు రోజుల్లో అది ~10% మేర ఉంది. బెంగళూరు విమానాశ్రయానికి ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులను అందిస్తున్న విమానాశ్రయాలంటే చెన్నై, కొచ్చి, హైదరాబాద్,గోవా ఉన్నాయి.
నాన్-మెట్రో కనెక్టివిటీ వృద్ధి మాత్రమే కాకుండా,బెంగళూరుకు ఉన్న భౌగోళిక స్థానం,
కర్ణాటక రాష్ట్రంలో వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కూడా బెంగళూరు విమానాశ్రయాన్ని దక్షిణ,మధ్య భారతదేశానికి సింహద్వారంగా మార్చింది. బెంగళూరు విమానాశ్రయం నుంచి 75 నిమిషాల్లోనే అనుకూలకరమైన ఫ్లైయింగ్ సమయంలో 23 నగరాలను చేరుకునేందుకు అవకాశం ఉంది. అంతే కాకుండా నాన్-మెట్రో కనెక్టివిటీ ప్రగతి సాధించడం బెంగళూరు విమానాశ్రయానికి మార్కెట్ ట్రాఫిక్‌ను పెంపొందించుకునేందుకు అలాగే, ట్రాన్స్‌ఫర్ ట్రాఫిక్,అంతర్జాతీయ మార్కెట్టుకూ మద్ధతుగా నిలిచింది.అంతే కాకుండా ఈ వ్యాప్తి ప్రదేశం~256 మిలియన్ (భారతదేశంలో 1/5మేర) ప్రజలకు సేవలు అందిస్తూ, బెంగళూరు
విమానాశ్రయం ఈ ప్రాంత ప్రగతి విజయగాథలో ముందంజలో ఉంది.
ఈ అంశాలన్నీ బెంగళూరు విమానాశ్రయాన్ని భవిష్యత్తులో అత్యంత దూర మార్గాలకు సమర్థవంతమైన కేంద్రంగా మార్చే అవకాశాలను వృద్ధి చేసింది.
ప్రయాణికులకు అసాధారణమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు బెంగళూరు విమానాశ్రయం ప్రపంచ స్థాయి మౌలికసదుపాయాలు,సౌలభ్యాలను అందించింది.ప్రస్తుతం బెంగళూరు విమానాశ్రయం అనుకూలకరమైన,సరళీకృతం చేసిన సింగిల్-టెర్మినల్ ట్రాన్స్‌ఫర్ అనుభవాన్ని అందిస్తోంది. అంతే కాకుండా ప్రయాణికులు విస్తృత స్థాయిలో షాపింగ్, డైనింగ్,అన్‌వైండింగ్ ఎంపికలను విమానాశ్రయంలో పొందవచ్చు.
అందులో కొత్తగా రూపొందించిన లాంజ్‌లు,ట్రాన్సిట్ హోటళ్లలో అత్యుత్తమ సేవలు అలాగే ఆతిథ్యం కలిసి ఉన్నాయి. దీనితో బెంగళూరు విమానాశ్రయంలో వృద్ధి చెందుతున్న ప్రయాణికులకు సేవలు అందించేందుకు ప్రస్తుతం ఉన్న రెండు ట్రాన్స్‌ఫర్ విభాగాలను మరింత విస్తరించగా, అడ్డంకులు లేని ప్రయాణం, ప్రయాణికులకు మృదువైన ట్రాన్స్‌ఫర్‌కు అదనపు లైన్‌ను నెలకొల్పారు. టర్మినల్ -2ను ప్రారంభించడం ద్వారా మేము మా ట్రాన్స్‌ఫర్ అనుభవాన్ని ఉత్తమం చేసే ,బెంగళూరు విమానాశ్రయాన్ని భారతదేశానికి సరికొత్త సింహ ద్వారంగా అభివృద్ధి చేసే నిరీక్షను కలిగి ఉన్నాము.