హైదరాబాద్, 13 మే 2021: భారతదేశ అగ్రగామి ఎక్స్ ప్రెస్ లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్, డచి పోస్ట్ డీహెచ్ఎల్ గ్రూప్ (డీపీడీహెచ్ఎల్) లో భాగమైన బ్లూ డార్ట్ భారతదేశంలో మారుమూల ప్రాంతాలకు డ్రోన్లతో టీకాలు, అత్యవసర వైద్య సరఫరాలను అందించడాన్ని విప్లవీకరించే లక్ష్యంతో బ్లూ డార్ట్ మెడ్ – ఎక్స్ ప్రెస్ కన్సార్టి యంను ఏర్పాటు చేసింది. బ్లూ డార్ట్ మెడ్ – ఎక్స్ ప్రెస్ కన్సార్టియం అనేది తెలంగాణ ప్రభుత్వం, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, నీతి ఆయోగ్, హెల్త్ నెట్ గ్లోబల్ లతో కలసి చేపట్టిన మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్ట్ లో భాగం.తెలంగాణలో ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు అవసరమైన మినహాయింపులు , డ్రోన్ ఫ్లైట్స్ ను ప్రయోగించేందుకు హక్కులను పౌర విమానయన మంత్రిత్వశాఖ (ఎంఒసిఎ) అందించింది. ఆరోగ్య సంరక్షణ వస్తువులను (మందులు, కోవిడ్-19 టీకాలు, రక్తం యూనిట్లు, వ్యాధి నిర్ధారణ వస్తువులు, ఇతర ప్రాణరక్షణ సమాగ్రి) పంపిణి కేంద్రాల నుంచి నిర్దిష్ట కేంద్రాలకు తీసుకెళ్ళడం, తిరిగి వెనక్కు తీసుకురావడానికి సంబంధించి సురక్షిత, కచ్చితమైన, విశ్వసనీయమైన పికప్, డెలివరీ కి ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను మదింపు వేయడం దీని లక్ష్యం. సప్లయ్ చెయిన్ ను మెరుగుపరిచేందుకు బ్లూ డార్ట్ కట్టుబడి ఉంది. కరోనా మహమ్మారితో తీవ్రస్థాయిలో పోరాడుతోంది. తెలంగాణలో ప్రస్తుత ఆరోగ్య సంరక్షణ లాజిస్టిక్స్ ను ఆప్టిమైజ్ చేసేందుకు బ్లూ డార్ట్ మెడ్ – ఎక్స్ ప్రెస్ ఫ్లైట్స్ ఒక తిరుగులేని డెలివరీ మోడల్ ను వినియోగించనున్నాయి. జిల్లా మెడికల్ స్టోర్స్, బ్లడ్ బ్యాంకుల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పిహెచ్ సిలు), కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ (సిహెచ్ సిలు), బ్లడ్ స్టోరేజ్ యూనిట్స్ కు, పీహెచ్ సిలు/ సీహెచ్ సి ల నుంచి సెంట్రల్ డయాగ్నస్టిక్ లేబొరేటరీలకు డెలివరీలను అందించేందుకు ఈ నమూనా వీలు కల్పిస్తుంది.


ఈ సందర్భంగా బ్లూడార్ట్ మేనేజింగ్ డైరెక్టర్ బాల్ ఫోర్ మాన్యుయెల్ మాట్లాడుతూ, ‘‘ఇప్పటికి ఓ ఏడాదిగా పోరాటం చేస్తున్నాం. కోవిడ్ -19పై చేస్తున్న పోరాటం రియల్ టైమ్ లో అవసరమైన పరిష్కా రాలకు సంబంధించి కొత్త సవాళ్లను విసురుతోంది. ఈ మహమ్మారి మనలో ప్రతి ఒక్కరికి కూడా లాజిస్టిక్స్ ప్రాధాన్యం,సాంకేతికత సారథ్యంతో కూడిన సప్లయ్ చెయిన్ మౌలిక వసతుల అవసరంపై పాఠా లు నేర్పింది. ఒక సంస్థగా బ్లూడార్ట్ ఎప్పుడూ భవిష్యత్ సన్నద్ధక సాంకేతికతలను తన చుట్టూరా కలిగి ఉంది. అది మమ్మల్ని ఈ మహమ్మారి ఎదురొడ్డి నిలిచేలా చేయడం మాత్రమే గాకుండా మరింత ఎదిగేం దుకు కూడా తోడ్పడింది. దేశవ్యాప్తంగా మేం 35,000 కు పైగా ప్రాంతాలకు చేరుకోగలిగాం. ప్రస్తుత పరిస్థి తి టీకాలు మరిన్ని ప్రాంతాలను చేరుకోవాల్సిన అవసరాన్ని కల్పించింది’’ అని అన్నారు.టీకాలను డెలివరీ చేసేందుకు గాను కంటికి కనిపించే హద్దు ఆవల కూడా ప్రయాణించేలా డ్రోన్ ఫ్లైట్స్ తో ప్ర యోగం చేయడం గురించి బ్లూడార్ట్ సీఎంఓ, బిజినెస్ డెవలప్ మెంట్ హెడ్ కేతన్ కులకర్ణి మాట్లాడుతూ, ‘‘సురక్షితమైన, సామర్థ్యపూరితమైన, తక్కువ వ్యయంతో కూడిన డ్రోన్ డెలివరీ ఫ్లైట్స్ ను సిద్ధం చేయడం ఈ కన్సార్టియం లక్ష్యం. సమర్థవంతమైన వ్యవస్థను ఉపయోగించడం ద్వారా ప్రస్తుత లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గించుకోవచ్చు, ఆరోగ్యసంరక్షణ రవాణాను వేగవంతమైందిగా, సామర్థ్యపూరితమైందిగా చేయవచ్చు. సంబంధిత కార్యకలాపాలు చేపట్టేందుకు హక్కులు కల్పించడం మాకెంతో ఆనందదాయకం. ఇది కచ్చితం గా ప్రస్తుత అవసరం. మానవజాతి ముందెన్నడూ లేని విషమ పరిస్థితిని ఎదుర్కొంటోంది. తాను కార్యకలా పాలు నిర్వహించే సమాజంలో, దానికి తిరిగి ఇచ్చేందుకు బ్లూడార్ట్ కట్టుబడి ఉంది. దాన్ని ఓ అడుగు ముందుకు తీసుకెళ్లేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది’’ అని అన్నారు.


తెలంగాణ ప్రభుత్వ ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్, ఐటీఈ అండ్ సి విభాగం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) శ్రీమతి రమాదేవి లంక మాట్లాడుతూ, ‘‘భవిష్యత్ విధానాలను ముందుకు తీసుకెళ్లేందుకు, ప్రస్తుత ఆరోగ్యసంరక్షణ సరఫరా చెయిన్ తో మిళితం చేసేందుకు అవసరమైన నిజమైన, ఆచరణ దాయక దృక్పథాలను ఈ ప్రాజెక్ట్ అందిస్తుంది. ప్రస్తుత సరఫరా చెయిన్స్ ను కోవిడ్ -19 మహమ్మారి దె బ్బ తీస్తున్న సందర్భంలో నూతన సాంకేతికతల అవసరం ఇప్పుడు ఎంతగానో ఉంది’’ అని అన్నారు.తెలంగాణ ప్రభుత్వ ఐటీఈ అండ్ సి విభాగం ముఖ్య కార్యదర్శి ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘అధునాతన సాంకేతికతలను అనుసరించే విషయంలో చురుగ్గా ఉన్న రాష్ట్రా ల్లో తెలంగాణ ఒకటి. డ్రోన్లను ఉపయోగించడం ద్వారా చేపట్టే ‘మెడిసిన్ ఫ్రమ్ ది స్కై’ ప్రాజెక్ట్ కూడా ఇదే వి ధమైన సూత్రాలకు అనుగుణంగా ఉంది. దేశంలోనే ఈ విధమైన ప్రాజెక్టుల్లో ఇది మొదటిది. ఆరోగ్య సం రక్షణ సరఫరా చెయిన్ విలువను జోడించేలా కంటిచూపు పరిధికి మించిన ఎత్తులో డ్రోన్లు ప్రయాణిస్తాయి. గ్రామీణ ప్రాంతాలకు ఆరోగ్యసంరక్షణలో సమానత్వం అదించడం దీని ఆశయం’’ అని అన్నారు.
Blue Dart forms Blue Dart Med-Express Consortium to operate experimental Unmanned Aircraft System
మహమ్మారిపై పోరాటంలో దేశానికి బ్లూ డార్ట్ అండగా నిలిచింది. దేశానికి సంబంధించి ట్రేడ్ ఫెసిలిటేటర్ గా ఉన్న బ్లూ డార్ట్ దేశవ్యాప్తంగా కూడా ముఖ్యమైన షిప్ మెంట్స్ డెలివరీకి వీలు కల్పించడం ద్వారా యా వత్ ప్రజాజీవనం స్తంభించిపోకుండా చూస్తోంది. సంస్థ తాత్వికతకు అనుగుణంగా, దేశం మహమ్మారి కబం ధ హస్తాల్లో చిక్కుకున్న నాటి నుంచి కూడా సప్లయ్ చెయిన్ ను కొనసాగించేందుకు బ్లూ డార్టర్లు నిర్విరా మంగా శ్రమిస్తున్నారు. సప్లయ్ చెయిన్ ను కొనసాగించేందుకు , ముఖ్యమైన షిప్ మెంట్లను, సరఫరాలను డెలివరీ చేసేందుకు గాను వైద్య ఉపకరణాలు, ఫార్మా రంగంతో కలసి బ్లూ డార్ట్ పని చేస్తోంది. కోవిడ్ వ్యాక్సిన్ శాంపిల్స్, ఉష్ణోగ్రత నియంత్రిత రవాణాతో కోవిడ్ -19 టెస్టింగ్ కిట్స్, వెంటిలేటర్లు, పీపీలు, టెస్టింగ్ కిట్స్, రీగెంట్స్, ఎంజైమ్స్, రెసిపిరేటర్లు, సర్జికల్ మాస్క్ లు, గాగుల్స్, గ్లోవ్స్ లాంటి ఇతర ముఖ్య మైన వస్తువులు వీటిలో ఉన్నాయి. కంపెనీ , ఆరు బోయింగ్ 757 ఫ్రైటర్లు ఆయా కార్యకలాపాలను వేగవంతంగా నిర్వహించేందుకు తోడ్పడుతున్నాయి.