365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 2,2025: జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం BMW తన ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిలో మరో వినూత్న కాన్సెప్ట్‌ను జోడించింది. IAA మొబిలిటీ 2025 షోలో BMW Motorrad ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ స్కూటర్ విజన్ CEను ఆవిష్కరించింది. హెల్మెట్ లేకపోయినా, ప్రత్యేక సేఫ్టీ ఫీచర్లతో ఈ స్కూటర్‌ను నడపవచ్చని కంపెనీ చెబుతోంది.

సేఫ్టీకి కొత్త రూపం
విజన్ CEలో ప్రధాన ఆకర్షణ దాని మెటల్ ట్యూబులర్ సేఫ్టీ కేజ్. ఇది రైడర్‌ను ఒక సేఫ్టీ సెల్‌లో కాపాడుతుంది. ప్రమాదంలో పడిపోయినా రైడర్‌ సురక్షితంగా ఉండేలా ఈ కేజ్ డిజైన్ చేశారు. అదనంగా సీట్‌బెల్ట్ సిస్టమ్, కొన్ని వేరియంట్లలో రేస్‌కార్‌ల మాదిరి 5-పాయింట్ బెల్ట్ కూడా ఇవ్వబడింది. ఢీకొనేటప్పుడు దెబ్బ తగలకుండా కేజ్‌పై ఫోమ్ ప్యాడింగ్ అమర్చారు.

డిజైన్ ఫ్యూచరిస్టిక్ లుక్
విజన్ CE డిజైన్ భవిష్యత్తు వాహనాలను తలపిస్తుంది. పొడవైన వీల్‌బేస్‌, తక్కువ ఎత్తులో ఉండే ఫ్రేమ్ దీన్ని నేలమీద తేలుతున్నట్టుగా చూపిస్తాయి. తెలుపు, నలుపు రంగుల కలయికలో నియాన్ ఎరుపు హైలైట్స్‌తో స్కూటర్ స్టైలిష్‌గా ఉంది. దీని సీటు డిజైనర్ లాంజ్ చెయిర్‌ను పోలి ఉంటుంది.

సెల్ఫ్-బ్యాలెన్సింగ్ టెక్నాలజీ
ఈ స్కూటర్‌లో గైరోస్కోప్‌లు, సెన్సార్లు, AI ఆధారిత సాఫ్ట్‌వేర్ సహకారంతో పనిచేసే సెల్ఫ్-బ్యాలెన్సింగ్ టెక్నాలజీని అందించారు. దీంతో వాహనం ఆగినప్పుడు కూడా ఎటువంటి స్టాండ్ అవసరం లేకుండా నిటారుగా నిలుస్తుంది. నగర ట్రాఫిక్‌లో సౌకర్యవంతంగా నడపడానికి, కొత్త రైడర్లకు భయాన్ని తగ్గించడానికి ఇది ఉపయుక్తంగా మారనుంది.

స్పెసిఫికేషన్లు
కంపెనీ ఇంకా పూర్తిస్థాయి వివరాలు వెల్లడించలేదు. అయితే ఇది CE 04 ఆర్కిటెక్చర్పై నిర్మించింది. ఇది 42PS శక్తిని ఇస్తుంది. 0-50 కి.మీ వేగాన్ని కేవలం 2.6 సెకన్లలోనే చేరుకోగలదు. ఒక్కసారి చార్జ్ చేస్తే 130 కి.మీ రేంజ్ అందిస్తుంది.

ఇది కూడా చదవండి…హైడ్రా టోల్‌ఫ్రీ నంబర్ 1070 ప్రారంభం..

BMW పాత ఆలోచనకు కొత్త రూపం
ఇలాంటి హెల్మెట్-ఫ్రీ స్కూటర్ కాన్సెప్ట్ BMWకి కొత్తది కాదు. 2000-2002 మధ్య కంపెనీ C1 స్కూటర్ను తయారు చేసింది. అది మార్కెట్లో పెద్దగా విజయవంతం కాకపోయినా, ఆ ఆలోచనను వదలని BMW.. ఇప్పుడు విజన్ CEతో ఆధునిక టెక్నాలజీ, కొత్త డిజైన్ జోడించి మళ్లీ రంగంలోకి తెచ్చింది.