365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,విశాఖపట్నం, మార్చి 23,2025: ఏరోస్పేస్ తయారీ రంగంలో నైపుణ్యాలను పెంపొందించేందుకు బోయింగ్ ఇండియా, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ (ఎల్ఎల్ఎఫ్) సంయుక్తంగా చేపట్టిన పారిశ్రామిక శిక్షణ కార్యక్రమం ద్వారా మూడో బ్యాచ్ విద్యార్థులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. నాల్గవ బ్యాచ్ శిక్షణ పొందుతుండగా, ఏప్రిల్ 2025 నాటికి మొత్తం 127 మంది విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందనున్నారు.
విశాఖపట్నంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మూడో బ్యాచ్ గ్రాడ్యుయేట్లను లోక్‌సభ సభ్యుడు మతుకుమిల్లి శ్రీభరత్ సత్కరించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ శిక్షణ, ప్లేస్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ డా. రామకృష్ణ రావు, ఫ్లూయెంట్గ్రిడ్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీ కృష్ణ గన్నమణి, బోయింగ్ ఇండియా & సౌత్ ఆసియా చీఫ్ ఆఫ్ స్టాఫ్ & సీఎస్‌ఆర్ లీడర్ ప్రవీణ యజ్ఞంభట్, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుధా ప్రియదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
Read this also…Boeing and Learning Links Foundation Empower Andhra Pradesh Students for Aerospace Careers
ఇది కూడా చదవండి…L2E: ఎంపురాన్’ ఓ మాయాజాలం.. మరచిపోలేని అనుభవం – మోహన్‌లాల్
ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో ప్రగతిశీల విధానాలను అమలు చేస్తూ, ప్రపంచస్థాయి శిక్షణ అవకాశాలను అందించేందుకు కృషి చేస్తోంది. ఈ కార్యక్రమం యువతకు ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు రాష్ట్రాన్ని అధునాతన తయారీ, ఏరోస్పేస్ కేంద్రంగా మార్చేందుకు తోడ్పడుతుంది” అని తెలిపారు.

ఈ శిక్షణ కార్యక్రమం విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులకు పరిశ్రమలకు అనుగుణంగా శిక్షణ అందిస్తుంది. ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్‌లో ముమ్మర శిక్షణ కల్పించబడుతోంది. ఇప్పటికే తొలి రెండు బ్యాచ్‌లలో 94% ప్లేస్‌మెంట్ రేటు నమోదు కాగా, ప్రస్తుతం శిక్షణ పొందుతున్న విద్యార్థులకు వివిధ పరిశ్రమల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్లను అందుబాటులోకి తెస్తున్నారు.
బోయింగ్ ఇండియా & సౌత్ ఆసియా ప్రెసిడెంట్ సలీల్ గుప్తే మాట్లాడుతూ, “దక్షిణాసియాలో రాబోయే 20 ఏళ్లలో 37,000 పైలట్లు, అంతే సంఖ్యలో సాంకేతిక నిపుణుల అవసరం ఏర్పడుతుందని, అందులో 90% డిమాండ్ భారతదేశం నుంచే ఉంటుందని బోయింగ్ తాజా అంచనా వెల్లడిస్తోంది. భారతీయ ఏవియేషన్ రంగం, ఇతర కీలక పరిశ్రమల వృద్ధిలో భాగస్వామ్యం కావడానికి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో యువతకు నైపుణ్యాలను పెంపొందించడం అత్యంత అవసరం” అని పేర్కొన్నారు.
డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (డీటీఈ) ఈ శిక్షణ కార్యక్రమాన్ని వృత్తి విద్యా సంస్థలకు ఆదర్శంగా గుర్తించింది. సాఫ్ట్ స్కిల్స్, సాంకేతిక శిక్షణ, పరిశ్రమ అనుభవం కలిపి సమగ్రంగా అందించడంతో, ఈ కోర్సు యువత ఉపాధి అవకాశాలను పెంచుతుందని అధికారులు వెల్లడించారు.
Read this also…“It’s Not a Film; It’s Magic” – Mohanlal on the Grand Trailer Launch of L2E: Empuraan in Mumbai
ఇది కూడా చదవండి…యుకే హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రతిష్ఠాత్మక గౌరవం – మెగాస్టార్ చిరంజీవి హృదయపూర్వక స్పందన..
లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ అధ్యక్షురాలు నురియా అన్సారీ మాట్లాడుతూ, “బోయింగ్ మద్దతుతో 2023లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఏరోస్పేస్ రంగానికి ప్రతిభావంతులను అందించేందుకు దోహదపడుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి దేశ భవిష్యత్తుకు సన్నద్ధమైన కార్మిక శక్తిని తీర్చిదిద్దేందుకు ఇది గొప్ప అవకాశమని” తెలిపారు.