365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూలై 18,2023: అను టెక్స్టైల్ అండ్ గోల్డ్ షాప్స్ యాజమాన్యం ఆధ్వర్యంలో మల్కాజిగిరి లో బోనాలపండుగ సంబురాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా మల్కాజిగిరి బిఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, సామాజిక సేవకుడు డా. రోహిత్ బాబు, కార్పొరేటర్లు మేకల సునీత రాము యాదవ్, ప్రేమ్ కుమార్లు హాజరయ్యారు.
సాయంత్రం 6 గంటలకు మొదలైన సందడి రాత్రి వరకు ఎంతో ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా టక్స్టైల్ రంగంలో 40 సంవత్సరాలుగా సేవలందిస్తున్నటెక్స్టైల్ అండ్ గోల్డ్ షాప్స్ యాజమాన్యం బోనాలు పండుగ సంబురాలు గౌతమ్ నగర్ డివిజన్ సాయినగర్ లో నిర్వ హించారు.
అను టెక్స్ లో శారీస్, గోల్డ్, కిడ్స్, లేడిస్ వేర్, రెడీ మేడ్, మెన్స్ వేర్ అన్నిరకాల కలెక్షన్ ఒకేషాప్ లో అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. మల్కాజిగిరి, కొత్తపేట, ఏఎస్.రావు నగర్, బొడప్పల్ అనుటెక్స్ షాప్స్ బ్రాంచిలలో అంగరంగవైభవంగా బోనాల పండుగ వేడుకలు జరిగాయి.
అను టెక్స్, అను జ్యూవెలర్స్ మల్కాజిగిరి, ఏఎస్.రావు నగర్లో బ్రాంచీల ద్వారా వినియోగదారులకు సేవలందిస్తున్నారు. ప్రతి ఏటా ఎంతో విశిష్టంగా బోనాలను నిర్వహించే అను టెక్స్ షాప్స్ యాజ మాన్యం ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా బోనాల పండుగ వేడుకలను ముఖ్య అతిథుల సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన పోలీసులకు అను టెక్స్ యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది.