Thu. Dec 7th, 2023

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 18,2023:దేశీయ స్టాక్‌ మార్కెట్లు మూడు రోజుల వరుస నష్టాల నుంచి బయటపడ్డాయి. మంగళవారం లాభాల్లో ముగిశాయి.

ఇజ్రాయెల్‌, పాలస్తీనా యుద్ధం మరిన్ని ప్రాంతాలకు విస్తరించదన్న సంకేతాలు ఇన్వెస్టర్లలో ఆత్మవిశ్వాసం నింపాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇజ్రాయెల్‌, జోర్డాన్‌ పర్యటనలకు రావడం, రెండు యూఎస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను మోహరించడం యుద్ధ తీవ్రతను తగ్గించనుంది.

పైగా ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్‌, చైనా, హాంకాంగ్‌ మార్కెట్లు ఎగిశాయి.

డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు బలపడి 83.26 వద్ద స్థిరపడింది. నేడు విదేశీ, భారత సంస్థాగత ఇన్వెస్టర్లు నెట్‌ బయ్యర్స్‌గానే ఉండటం గమనార్హం. నేడు బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాల షేర్లు జోరు ప్రదర్శించాయి.

క్రితం సెషన్లో 66,168 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 66,558 వద్ద మొదలైంది. అక్కడ్నుంచి స్థిరంగా చలించి 66,559 వద్ద ఇంట్రాడే గరిష్ఠానికి చేరుకుంది. ఐరోపా మార్కెట్లు ఆరంభమయ్యాక 66,309 వద్ద ఇంట్రాడేలో కనిష్ఠాన్ని తాకింది.

ఆఖరికి 261 పాయింట్ల లాభంతో 66,428 వద్ద ముగిసింది. మంగళవారం ఉదయం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 19,843 వద్ద మొదలైంది. 19,775 వద్ద కనిష్ఠాన్ని తాకింది. 19,849 వద్ద గరిష్ఠాన్ని అందుకొని మొత్తంగా 79 పాయింట్ల లాభంతో 19,811 వద్ద క్లోజైంది. ఇక బ్యాంకు నిఫ్టీ 183 పాయింట్లు ఎగిసి 44,409 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 50లో 38 లాభాల్లో 12 నష్టాల్లో ముగిశాయి. బీపీసీఎల్‌ (2.17%) , పవర్‌ గ్రిడ్‌ (2.07%), కోల్‌ ఇండియా (1.76%), ఎస్బీఐ లైఫ్‌ (1.75%), హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ (1.74%) టాప్‌ గెయినర్స్‌.

టాటామోటార్స్‌ (1.53%), ఎల్‌టీ (1.09%), యూపీఎల్‌ (0.89%), ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు (0.86%), టీసీఎస్‌ (0.43%) అత్యధికంగా నష్టపోయాయి.

రంగాల వారీగా పరిశీలిస్తే నేడు కన్జూమర్‌ డ్యురబుల్స్‌ మాత్రమే స్వల్పంగా నష్టపోయింది. బ్యాంకు, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకు, హెల్త్‌కేర్‌ సూచీలు ఎగిశాయి.

నిఫ్టీ అక్టోబర్‌ నెల ఫ్యూచర్స్‌ ఛార్ట్‌ను గమనిస్తే 19,850 వద్ద రెసిస్టెన్సీ, 19,770 వద్ద సపోర్టు ఉన్నాయి. ఇన్వెస్టర్లు స్వల్ప కాలంలో సియట్ లిమిటెడ్‌, టీటీకే ప్రెస్టీజ్‌, రిలాక్సో ఫుట్‌వేర్‌, ఐఈఎక్స్‌ షేర్లను కొనుగోలు చేయొచ్చు.

అట్మాస్పియర్‌ రియాల్టీలో మ్యాన్‌ ఇన్‌ఫ్రా కన్స్‌స్ట్రక్షన్‌ తమ వాటాను అదనంగా 12.5 శాతానికి పెంచుకోనుంది. ఇప్పటికే అందులో కంపెనీకి 17.5 శాతం వాటా ఉంది. దీర్ఘ కాలిక ప్రాతిపదికన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి టైటాన్‌ రూ.1000 కోట్ల రుణాలు తీసుకోనుంది.

క్యూటూ ఫలితాల్లో పీసీబీఎల్‌ నిరాశపరిచింది. ఆదాయం 8.7 శాతం తగ్గింది. తెలంగాణలోని జడ్చర్లలో నెలకొన్న శిల్పా మెడికేర్‌ నాలుగో యూనిట్లో ఆస్ట్రేలియా జీఎంపీ తనిఖీలు ముగిశాయి. న్యూజెన్‌ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ ఆదాయం 16.51 శాతం ఎగిసి రూ.293.23కోట్లుగా నమోదైంది.

భారతీ ఎయిర్‌టెల్‌, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, కోల్‌ ఇండియా, డిక్సన్ టెక్నాలజీస్‌, ఫ్యాక్ట్‌, టాటా కన్జూమర్‌, జొమాటో షేర్లు ఇంట్రాడేలో 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709