365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,ఫిబ్రవరి 24,2022: గతంలో రాబర్ట్ బోసచ్,ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ సొల్యూషన్స్ (RBEI) అని పిలువబడే బోసచ్ గ్లోబల్ సాప్ట్‏‏‎వేర్‏‏‎ టెక్నాలజీస్ (BGSW), భారతదేశంలో తమ 25 సంవత్సరాల వారసత్వాన్ని వేడుకగా జరుపుకొనుటకు,ఆ సంస్థ 25,000 మంది సహచరులతో తమ బంధానికి ప్రతీకగా 25,000 మొక్కలు నాటడానికి హార్ట్‌ఫుల్‌నెస్ వారి మినీ-ఫారెస్ట్ ప్లాంటేషన్ డ్రైవ్ లో భాగస్వామి అయినది.బెంగళూరు, కోయంబత్తూరు,హైదరాబాద్ ఈ బహుళ నగరాల్లో తోటలు నిర్వాహణకు తేదీ ఫిబ్రవరి 24, 2022 న ప్రారంభించారు.

మొబిలిటీ ఇంజినీరింగ్ సంస్థకు ప్రముఖ ఉపాధ్యక్షులు,ఎగ్జిక్యూటివ్ BGSW లీడర్ షిప్ సభ్యులు అయిన ఆర్ కె షెనాయ్ గారు ఈ అంకురార్పణ గురించి మాట్లాడుతూ, “ఈ ప్లాంటేషన్ డ్రైవ్ BGSW జీవన నాణ్యతను మెరుగుపరచడం పై దృష్టిపెడుతుంది తెలివైన, అనుసంధానం,స్థిరమైన కొత్త ఉత్పత్తులు, హైటెక్ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి మా నిబద్ధతని ఇది ప్రతిబింబిస్తుంది. మేము భారతదేశంలో మా వారసత్వం 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భాన్ని,రాబోయే అనేక దశాబ్దాల పాటు సానుకూల దీర్ఘకాల ప్రయోజనాన్ని అందించే కార్యక్రమం చేపట్టటం ద్వారా వేడుకగా జరుపుకుంటున్నాము.

ప్రపంచవ్యాప్తంగా బోసచ్ సుస్థిరత కోసం అనేక చర్యలు తీసుకుంది,కార్బన్ కాలుష్యాన్ని నివారించిన సంస్థల్లో మొదటిది. BGSW సరస్సుల పునరుజ్జీవనంతో సహా అనేక కార్యక్రమాలను నడుపుతోంది.గ్రహం, పర్యావరణ సమతుల్యత
పరిరక్షణ,నిర్వహణలో ఇది మరో చిన్న అడుగే కానీ నిజాయితీతో కూడిన అడుగు.
స్థానిక ప్రజానీకంతో కలిసి, మేము వాతావరణ మార్పులతో పోరాడుతూ భవిష్యత్ తరానికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించవచ్చు.”హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ అధ్యక్షులు,మార్గదర్శి శ్రీ కమలేష్ పటేల్ (ప్రియంగా దాజీ అని పిలువబడే) మాట్లాడుతూ,”అడవుల ద్వారా హార్ట్‌ఫుల్‌నెస్ భవిష్యత్తు తరాలకు విస్తృతమైన అవగాహనను సృష్టించడానికి,స్థిరమైన వృక్ష సంపద పెంపొందించడానికి మా ప్రయత్నం.

సహజ పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడానికి అవసరమైన వృక్షాలను కేవలం ఒక సంస్థ లేదా ఒక్కో రోజులో సాధించలేదు. కార్పొరేట్ లు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, అటవీ,వ్యక్తుల అందరూ కూడా సంయుక్తంగా నిర్వహించాల్సిన బాధ్యత. పచ్చదనాన్ని పెంపొందించే దిశగా ఇటువంటి చర్యలు మాతో సంయుక్తంగా చేపట్టటానికి కార్పొరేట్ సంస్థలు చూపుతున్న ఆసక్తి మిమ్మల్ని మరింత ఉత్సాహపరుస్తుంది. “భారతదేశంలో తమ 25 సంవత్సరాల వేడుకను,సుస్థిరతకు నిబద్ధతను సూచిస్తూ అనేక నగరాల్లో ఈ భారీ స్థాయి బహుళ నగర మినీ ఫారెస్ట్ ప్లాంటేషన్ డ్రైవ్ ను చేపట్టినందుకు బోసచ్ గ్లోబల్ సాప్ట్‏‏‎వేర్‏‏‎ టెక్నాలజీస్ (BGSW)ను మేము అభినందిస్తున్నాము.”

బెంగళూరు, హైదరాబాద్, కోయంబత్తూరు అంతటా 25,000 మొక్కలు పెంచడంతో, ఈ ప్రాజెక్ట్ జీవవైవిధ్యాన్ని మెరుగుపరచడం, నగర కాలుష్యాన్ని తగ్గించడానికి సూక్ష్మ వాతావరణాన్ని సృష్టించడం, స్థానిక సమాజాలకు సహజంగా పండించిన పండ్లు ,ఔషధ మూలికలను అందించడం, స్థానిక భూగర్భజలాల స్థాయి పెంచడం,రాబోయే పదేళ్లలో కనీసం 5,000 టన్నుల కార్బన్ ఉద్గారాన్ని తగ్గించడంపై దృష్టి పెడుతుంది. BGSW వారి స్వచ్ఛంద సేవల భాగస్వామి హార్ట్‌ఫుల్‌నెస్ సౌజన్యంతో స్థానిక కమ్యూనిటీలతో కలిసి నాటిన మొక్కల సంరక్షణ మరియు పోషణ నిర్ధారించడానికి కనీసం రెండు సంవత్సరాల పాటు జియో-ట్యాగింగ్,వారి ఎదుగుదలను పర్యవేక్షించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తుంది.

25,000 మొక్కలు అడవులను ఉపయోగించి హార్ట్‌ఫుల్‌నెస్ ప్రత్యేకత కలిగిన హార్టీకల్చర్ హై డెన్సిటీ (HCHD) ప్లాంటేషన్ విధానం ద్వారా నాటబడతాయి. ఈ పద్ధతిలో సేంద్రీయ ఎరువులు,వెర్మికంపోస్ట్, ఆవు-పేడ,కోకోపీట్ ఉపయోగించి మట్టిని విస్తృతంగా సారవంతం చేసే విధంగా ఉంటుంది. BGSW ఒక మినీ అడవిని సృష్టించడానికి 100 కు పైగా విభిన్న జాతుల చెట్ల పెంపకాన్ని సులభతరం చేస్తుంది. ప్లాంటేషన్ డ్రైవ్ కోసం ఎంపిక చేసిన చెట్లు భారతీయ, అంతరించే జాతి వృక్షాలు అయ్యి ఉంటాయి,విస్తృతమైన చెట్ల వేర్లు ఒకదానికి మరొకటి అనుసంధానం కలిగి ఒకదాని ఇంకోటి మద్దతు ఇస్తుంటాయి.

ప్రెస్ విచారణల కొరకు సంప్రదించాల్సిన వ్యక్తి:
అక్షయిత అలోక్ సక్సేనా
AkshayitaAlok.Saxena@in.bosch.com