365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,ఆగష్టు 20,2022: లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో కొనుగోలు చేసిన బిర్యానీ తిని13 ఏళ్ల బాలుడు వారం రోజుల క్రితం మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్‌లో నివాసం ఉంటున్న కుటుంబసభ్యులు ఆగస్టు 13న లక్డీకాపూల్‌లోని ఓ హోటల్ నుంచి తెచ్చిన బిర్యానీ తిన్నారు.
“నలుగురు కుటుంబసభ్యులు ఉన్నారు. వీరిలో ఒక భర్త, భార్య,ఇద్దరు పిల్లలు అంటే అమ్మాయి,అబ్బాయిలు ఉన్నారు. వీళ్ళు సూర్యాపేట నుంచి తిరిగి వచ్చి లక్డీకాపూల్ లోని ఓ హోటల్ ల్లో బిర్యానీ కొన్నారు. అదే వారు ఇంటికి వెళ్లి తిన్నారు. ఆ తర్వాత మరుసటి మధ్యాహ్నం వరకు కొడుకు నిద్ర లేవలేదు. అతనిని ఎంతసేపు లేపినా లేవలేదు. ఏమైందని చూడగా అతను చనిపోయినట్లు గుర్తించారు అని సైఫాబాద్ పోలీసు ఒకరు తెలిపారు.
మృతుని తండ్రి అతని కుమార్తె కూడా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాలుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీఆర్‌పీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించి బాలుడి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.
“బిర్యానీ నమూనాలను సేకరించి, విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపారు, నివేదికల ఆధారంగా, తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. సూర్యాపేట నుంచి తిరిగి వచ్చిన తర్వాత నిద్రపోయే ముందు బిర్యానీ మాత్రమే తిన్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కేవలం ఆ బిర్యానీ కారణంగా ఫుడ్ పాయిజన్ అయ్యిందని, అందుకే తమ కొడుకు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.