British Deputy High Commissioner Win Owen met CM Jagan

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, అమరావతి, అక్టోబర్ 14,2022: ఏపీ సీఎం జగన్‌తో బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌ విన్‌ ఓవెన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్య, వైద్య రంగాలలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న కృషి, అనుసరిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయన్న విన్‌ ఓవెన్, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్దమని ప్రకటించారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై వివిధ అంశాలపై క్షణ్ణంగా చర్చించిన అంశాలను విన్‌ ఓవెన్ జగన్ తో పంచుకున్నారు.

యూకేలో అమలవుతున్న ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ఇక్కడ కూడా అమలుచేయాలన్న ప్రణాళిక చాలా బావుందని, అవసరమైన సహకారం అందిస్తామని హామి ఇచ్చారు. వైద్య, ఆరోగ్య రంగం బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బ్రిటీష్‌ బృందానికి సీఎం జగన్ వివరించారు.

British Deputy High Commissioner Win Owen met CM Jagan

యూకే-భారత్‌ విద్యార్ధుల పరస్పర మార్పిడి విధానం, ఏపీ నుంచి ఎక్కువ మంది విద్యార్ధులకు బ్రిటన్‌ వీసాలు ఇప్పించే విషయంపై కూడా ఈ సమావేశంలో చర్చ, సానుకూలంగా స్పందించిన విన్‌ ఓవెన్‌. ఐటీ, పరిశోధన రంగాలపై ఆసక్తి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ భాగస్వామ్యంతో ముందుకెళ్ళేందు కు అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎంకి హామి ఇచ్చిన బ్రిటీష్‌ బృందం.

ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై బ్రిటీష్‌ బృందానికి జగన్ వివరించారు, రాష్ట్రంలో అభివృద్ది చేస్తున్న పారిశ్రామిక పార్కుల పురోగతిపై ఈ సమావేశంలో చర్చించారు. వ్యవసాయరంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న విధానాలను ఆసక్తిగా విన్‌ ఓవెన్‌ తెలుసుకున్నారు.

ఉపాధ్యాయుల శిక్షణకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చ, విద్యారంగానికి సంబంధించిన పూర్తి సహాయ సహకారాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రికి ఓవెన్‌ బృందం వివరించింది. ఈ సమావేశంలో పాల్గొన్న బ్రిటీష్‌ కమిషన్‌ ట్రేడ్, ఇన్వెస్టిమెంట్‌ హెడ్‌ వరుణ్‌ మాలి, పొలిటికల్‌ ఎకానమీ అడ్వైజర్‌ నళిని రఘురామన్, సీఎం స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ కేఎస్‌.జవహర్‌ రెడ్డి పాల్గొన్నారు.